News January 10, 2026
మూవీ మేకర్స్.. ముందే ప్లానింగ్ ఉండదా?

సినిమా నచ్చితే ఫ్యాన్స్ రెండు, మూడు సార్లు చూస్తారు. అయితే కొంత నెగటివ్ టాక్ వచ్చినా మేకర్స్ స్ట్రాటజీలు మారుస్తున్నారు. సినిమా విడుదలైన 2-3 రోజులకు మరిన్ని సీన్లు యాడ్ చేసి క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. తాజాగా ప్రభాస్ ‘రాజాసాబ్’ విషయంలోనూ పలు కారణాలతో <<18818253>>మేకర్స్<<>> ఇదే చేస్తున్నారు. దీంతో రూ.కోట్లు ఖర్చు చేసి సినిమా తీసి ఎలా రిలీజ్ చేయాలో ముందే ప్లాన్ చేసుకోరా? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
Similar News
News March 14, 2026
నెతన్యాహు చనిపోయారా?

ఇరాన్‌తో యుద్ధం వేళ సంచలన ప్రశ్న తెరపైకి వచ్చింది. నెతన్యాహు మృతి చెందారని SMలో ప్రచారం జరుగుతోంది. యుద్ధం గురించి మాట్లాడిన వీడియోను ఆయన నిన్న Xలో షేర్ చేశారు. అందులో నెతన్యాహు కుడిచేతికి 6 వేళ్లున్నాయి. దీంతో ఇది AI వీడియో అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. నెతన్యాహు మరణం గురించి శత్రుదేశానికి తెలియొద్దనే ఇలా AIతో వీడియో చేసి రిలీజ్ చేశారని అంటున్నారు. దీనిపై ఇజ్రాయెల్ స్పందించాల్సి ఉంది.
News March 14, 2026
FIFA WC, 2028 ఒలింపిక్స్‌కు నో ఎంట్రీ.. ట్రంప్‌కు షాక్ తప్పదా?

USలో ఈ ఏడాది జరిగే FIFA WC, 2028 LA ఒలింపిక్స్‌కు ట్రంప్‌ను, ప్రభుత్వ అధికారులను నిషేధించాలని వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(WADA) యోచిస్తున్నట్లు సమాచారం. 2023 నుంచి తమకు చెల్లించాల్సిన $7.3 మిలియన్లను US పెండింగ్‌లో ఉంచడమే కారణమని తెలుస్తోంది. 2014 సోచి వింటర్ ఒలింపిక్స్‌లో రష్యన్, 2024లో చైనా అథ్లెట్లు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలినప్పటికీ నిర్దోషులుగా తేల్చడంతో WADA, US మధ్య విభేదాలు ముదిరాయి.
News March 14, 2026
మళ్లీ వర్షాలు!

ఎండలతో అల్లాడిపోతున్న తెలుగు ప్రజలకు కాస్త ఊరట కలగనుంది. ద్రోణి ప్రభావంతో రేపటి నుంచి పలు జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉందని IMD వెల్లడించింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30-50KM వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఈ నెల 18, 19, 20 తేదీల్లో HYD, ఉ.గోదావరి, తిరుపతి, కర్నూలు, నంద్యాల, కడప, నెల్లూరు జిల్లాల్లో వడగండ్లతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.


