News January 10, 2026
నారావారిపల్లెలో CM పర్యటన వివరాలు.!

CM చంద్రబాబు ఈ నెల 12న తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3.40 గంటలకు వెలగపూడి హెలిప్యాడ్‌కు చేరుకున్న అనంతరం సాయంత్రం 5.20 గంటలకు చంద్రగిరి రంగంపేట హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి 5.35 గంటలకు నారావారి పల్లెలోని ఆయన నివాసానికి చేరుకోనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. సీఎం పర్యటనకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Similar News
News February 16, 2026
విశ్వక్‌కు వరుస షాక్‌లు.. రూటు మార్చాల్సిందేనా?

ENE, ఫలక్‌నుమాదాస్ లాంటి సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న విశ్వక్‌సేన్‌కు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. చాలా కాలంగా హిట్‌కు దూరమైన ఆయనకు తాజాగా రిలీజైన ‘ఫంకీ’ కూడా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. అంతకుముందు ‘లైలా’, ‘మెకానిక్ రాకీ’ కూడా ఫెయిలయ్యాయి. దీంతో విశ్వక్ సరైన కథలను ఎంపిక చేసుకోవట్లేదన్న విమర్శలొస్తున్నాయి. ప్రస్తుతం చేస్తున్న ‘ENE2’, ‘కల్ట్’ సినిమాలైనా ఆయనకు హిట్ ఇస్తాయేమో చూడాలి.
News February 16, 2026
మెట్‌పల్లి: క్రాస్ ఓటింగ్.. BJP కౌన్సిలర్ సస్పెండ్

మెట్‌పల్లి పుర ఎన్నికల్లో పార్టీ విప్‌ను ధిక్కరించి కాంగ్రెస్‌కు ఓటు వేసిన కౌన్సిలర్ చెట్లపల్లి మీనాపై BJP క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఆమెకు సహకరించిన కౌన్సిలర్ భర్త, కోరుట్ల నియోజకవర్గ బీజేపీ ఇన్‌ఛార్జ్ చెట్లపల్లి సుఖేందర్‌ను కూడా పార్టీ శాసన ఉల్లంఘనకు బాధ్యులుగా గుర్తించింది. ఇద్దరినీ 6 సంవత్సరాలపాటు సస్పెండ్ చేస్తున్నట్లు BJP రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ కన్వీనర్ రవీందర్ విశ్వనాథ్ ప్రకటించారు.
News February 16, 2026
చిత్తూరు SP పరిష్కార వేధికకు 36 అర్జీలు

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో SP తుషార్ డూడీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారవేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. కాగా బాధితుల నుంచి ఎస్పీ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 36 ఫిర్యాదులు అందినట్టు వెల్లడించారు. ఇందులో అత్యధికంగా నగదు లావాదేవీలు 6, ఆస్తి తగాదాలు 6, భూతగాదాల ఫిర్యాదులు 17 అందాయన్నారు. వీటిని సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.


