News January 10, 2026

మంత్రి అనిత- సీనియర్ల మధ్య గ్యాప్?

image

అనకాపల్లి జిల్లాలో సీనియర్ MLAలు, మాజీ మంత్రులతో హోంమంత్రి అనిత అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ‌ఆమె కార్యక్రమాల్లో సీనియర్లకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, ప్రొటోకాల్ పరమైన పిలుపులు తప్ప ఆత్మీయ ఆహ్వానాలు లేవని కూటమి వర్గాలు చర్చించుకుంటున్నాయి. తాజాగా అడ్డురోడ్డు ఆర్డీవో కార్యాలయ ప్రారంభోత్సవానికి పలువురు ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం ఈ అసంతృప్తికి నిదర్శనమంటున్నారు.

Similar News

News February 13, 2026

రంగారెడ్డి జిల్లాలో 2చోట్ల బోణీ కొట్టిన BRS

image

రంగారెడ్డి జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల్లో BRS బోణీ కొట్టింది. ఇబ్రహీంపట్నంలోని 24 వార్డులకు సంబంధించిన ఫలితాల్లో 11వ వార్డు BRS అభ్యర్థి శ్రీలత రాంబాబు 484 ఓట్లతో, 12వ వార్డు కొండిగారి త్రిలోక్ 316 ఓట్లతో విజయం సాధించారు. త్రిలోక్ మాజీ MLA కొండిగారి రాములు కుమారుడు. ఫలితాలు వేగంగా తెలుసుకునేందుకు STAY TUNED TO Way2News.

News February 13, 2026

రంగారెడ్డి: ఓట్ల లెక్కింపు 64 టేబుళ్లు ఏర్పాటు

image

రంగారెడ్డి జిల్లాలోని 6 మున్సిపాలిటీల పరిధిలో 126 వార్డులుండగా వీటిల్లో 274 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1,76,023 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 1,39,044 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. షాద్‌నగర్‌లో 14 టేబుళ్లు, మొయినాబాద్‌లో 14, ఇబ్రహీంపట్నంలో 12, శంకర్‌పల్లిలో 10, చేవెళ్లలో 9, ఆమనగల్లులో 5 చొప్పున మొత్తం 64 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం 265 మందిని నియమించారు.

News February 13, 2026

విశాఖ: బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

image

విశాఖ జిల్లాలోని ఎంజేపీ ఏపీ బీసీ గురుకులాల్లో 5వ తరగతి, 6-8 (బ్యాక్‌లాగ్), ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు. ఆసక్తి గల విద్యార్థులు మార్చి 4వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ 12న 5వ తరగతికి, ఏప్రిల్ 19న మిగిలిన తరగతులకు ప్రవేశ పరీక్షలు జరుగుతాయని గురుకులం ప్రిన్సిపల్ గుణుపూరు పురుషోధి తెలిపారు. మరిన్ని వివరాలకు www.mjpapbcwreis.pacfss.inను సందర్శించాలన్నారు.