News January 10, 2026

10 పరుగుల తేడాతో ఓటమి

image

WPL-2026లో గుజరాత్ జెయింట్స్ చేతిలో యూపీ వారియర్స్ 10 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ 207 రన్స్ చేయగా ఛేదనలో యూపీ 197-8 స్కోరుకు పరిమితమైంది. చివరి 3 బంతుల్లో 6, 4, 4 బాదినా ప్రయోజనం లేకపోయింది. లిచ్‌ఫీల్డ్(78) అర్ధసెంచరీ చేయగా మెగ్ లానింగ్(30), శ్వేత(25) రన్స్ చేశారు. GG బౌలర్లలో రేణుకా, జార్జియా, సోఫీ తలో 2 వికెట్లు తీశారు. గార్డ్‌నర్, రాజేశ్వరీ చెరో వికెట్ తీశారు.

Similar News

News February 22, 2026

తగ్గిన చికెన్ రేట్లు

image

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు స్వల్పంగా తగ్గాయి. విజయవాడలో కేజీ స్కిన్ లెస్ కోడి మాంసం రూ.200 పలుకుతోంది. గుంటూరులో రూ.190, నరసరావుపేటలో రూ.230కి విక్రయిస్తున్నారు. ఇక హైదరాబాద్‌లో కేజీ చికెన్ రేట్ రూ.230-250 మధ్య సేల్ చేస్తున్నారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో రూ.240-260గా ఉంది. మీ ఏరియాలో చికెన్ రేట్లు ఎలా ఉన్నాయి?

News February 22, 2026

వేధింపులను ఎదుర్కోవడం నేర్చుకోండి

image

చాలామంది మహిళలు భర్త, అత్తవారింటి నుంచి వేధింపులు ఎదురైనపుడు కుటుంబ పరువు గురించి ఆలోచించి వాటిని భరిస్తూ కుంగిపోతున్నారు. కొందరు ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. మహిళలను వెంబడించినా, దూషించినా, అడ్డుకున్నా, వేధింపులకు గురి చేసినా.. ఐపీసీ పలు సెక్షన్ల కింద శిక్షార్హులని చెబుతున్నారు నిపుణులు. ఇలాంటి వాటిపై మహిళలు అవగాహన పెంచుకోవాలని, అందుబాటులో ఉన్న సౌకర్యాలు వాడుకోవాలని సూచిస్తున్నారు.

News February 22, 2026

హనీ ట్రాప్.. కోడిపెట్టను ఎరగా వేసి పుంజు ఎత్తుకెళ్లారు!

image

TG: పురుషులను బురిడీ కొట్టించి డబ్బు కాజేయడం, రహస్య సమాచారం సేకరించే హనీ ట్రాప్ కేసులు చూస్తుంటాం. కానీ భద్రాద్రి(D) జేత్యాతండాలో దుండగులు కోడిపెట్టను ఎరగా వేసి పుంజును ఎత్తుకెళ్లారు. రైతు లకావత్ జేత్‌రామ్ 3పుంజులు, ఒక పెట్టను పెంచుకుంటున్నాడు. 3రోజుల క్రితం ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి కోడిపెట్టను చూపించి, దగ్గరికి వచ్చిన పుంజును పట్టుకొని ఉడాయించారు. జేత్‌రామ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.