News January 10, 2026
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ: జనసేన

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన ప్రకటించింది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సాధ్యమైనన్ని స్థానాల్లో తమ అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు వెల్లడించింది. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున ప్రతీ జనసైనికుడు, వీరమహిళ ప్రచారానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చింది. త్వరలో ఎన్నికల కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొంది.
Similar News
News February 13, 2026
పిల్లలకు పాలు అరగాలంటే..!

పసిపిల్లలు పాలు తాగిన తర్వాత కచ్చితంగా బర్పింగ్ చేయించాలి. లేదంటే వారు తాగిన పాలను వాంతి చేసుకునే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. పిల్లలను బర్పింగ్ చేయించడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారిని సున్నితంగా భుజంపై పెట్టుకొని నెమ్మదిగా వీపును సవరదియ్యాలి. లేదంటే బేబీని ఒళ్లో కూర్చోబెట్టుకొని కాస్త ముందుకు వంచి వీపును సవరదియ్యాలి. ఇలా త్రేన్పులు వచ్చే వరకు చెయ్యాలని చెబుతున్నారు.
News February 13, 2026
తారిఖ్‌తో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా: మోదీ

బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో <<19125261>>ఘన విజయం<<>> సాధించిన BNP చీఫ్ తారిఖ్ రెహ్మాన్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ గెలుపు బంగ్లా ప్రజలకు మీ నాయకత్వంపై ఉన్న నమ్మకానికి నిదర్శనం. డెమొక్రటిక్, ప్రోగ్రెసివ్ బంగ్లాదేశ్‌కు భారత్ మద్దతుగా ఉంటుంది. ఇరు దేశాల మధ్య బంధాలు బలోపేతం చేయడానికి మీతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా’ అని ట్వీట్ చేశారు.
News February 13, 2026
పోస్టల్ బ్యాలెట్.. లీడింగ్‌లో కాంగ్రెస్

TG: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ ఆధిక్యత కనబర్చింది. ఏదులాపురం (ఖమ్మం), మధిర, నాగర్‌కర్నూల్, సంగారెడ్డి, మంచిర్యాల, లక్షెట్టిపేట, చెన్నూరు, ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్ లీడ్‌లో ఉంది. నిర్మల్, ఖానాపూర్, కాగజ్‌నగర్‌లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.


