News January 10, 2026
ఆకర్షణీయంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్: కలెక్టర్ రిజ్వాన్ బాషా

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో నిర్మించబోతున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ జిల్లాలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. జఫర్‌గఢ్ మండలంలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. MLA కడియం శ్రీహరి చొరవతోనే జిల్లాలో మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరైందని తెలిపారు. ఈ పాఠశాల ద్వారా విద్యార్థులకు అత్యాధునిక వసతులు అందుతాయని, నిర్మాణాన్ని సత్వరమే పూర్తి చేస్తామన్నారు.
Similar News
News January 12, 2026
కేంద్ర బడ్జెట్.. దేశ చరిత్రలో తొలిసారి..

ఫిబ్రవరి 1 ఆదివారం అయినప్పటికీ అదే రోజు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధికారికంగా ప్రకటించారు. ఇలా ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టడం దేశ చరిత్రలో తొలిసారి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు.
News January 12, 2026
సికింద్రాబాద్ పేరు మార్చట్లే: CM రేవంత్ రెడ్డి

సికింద్రాబాద్ అస్తిత్వాన్ని తగ్గించేలా చేస్తే ఊరుకోబోమని, ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఉద్యమానికి రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఓ సమాధానం చెప్పారు. సికింద్రాబాద్ పేరు మార్చట్లే, రాచకొండ ఒక్కటే రాజరికంలా ఉందని ఆ పేరు మార్చామన్నారు. కాగా..సిటీ కమిషనరేట్ పునర్వ్యవస్థీకరణలో రాచకొండ కమిషనరేట్ బదులుగా మల్కాజిగిరి కమిషనరేట్ ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు.
News January 12, 2026
ఖమ్మం జిల్లాలో యూరియా కొరత లేదు: DAO

ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం 9,844 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, ఎటువంటి కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి డి.పుల్లయ్య తెలిపారు. రైతులకు సకాలంలో యూరియా సరఫరా చేసేందుకు అన్ని మండలాల్లో చర్యలు చేపట్టినట్లు చెప్పారు. మార్క్‌ఫెడ్ ద్వారా ప్యాక్స్, ప్రైవేట్ డీలర్లకు యూరియా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 32,793 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.


