News January 10, 2026
అన్నమయ్య: సంక్రాంతికి ఊర్లకు వెళ్లేవారికి అలర్ట్

సంక్రాంతికి ఊరికి వెళ్లేవారు ఇంటికి లాక్‌వేసి వెళ్లాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగకు వెళ్లేవారికి మైకులతో పోలీసులు ప్రచారం చేయాలని, ఇంట్లో బంగారు నగలు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లో భద్రపరచుకోవాలన్నారు. ఊర్లకు వెళ్లేప్పుడు పక్క ఇంట్లోవారికి గమనించమని చెప్పాలన్నారు. విలువైన వస్తువులు, సమాచారాన్ని, ఆర్థిక విషయాలను ఇతరులకు చెప్పకూడదని సూచించారు.
Similar News
News March 23, 2026
ఏప్రిల్ 3న ఓటీటీలోకి ‘సితారే జమీన్ పర్’

బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సితారే జమీన్ పర్’ సినిమా ఎట్టకేలకు OTTలోకి రానుంది. ఏప్రిల్ 3 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. గతేడాది జూన్ 20న ఈ మూవీ రిలీజ్ కాగా రూ.260 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఆగస్టు 1 నుంచి యూట్యూబ్‌లో ‘పే పర్ వ్యూ’ పద్ధతిలో అందుబాటులోకి తెచ్చారు. రూ.100 చెల్లించి చూసే అవకాశం కల్పించారు. ఇప్పుడు OTTలోకి వస్తోంది.
News March 23, 2026
కడప: ఇవాళ్టి పరీక్షకు 27,677 మంది హాజరు!

కడప జిల్లాలో 167 కేంద్రాల్లో సోమవారం 10వ తరగతి గణితం పరీక్షలు జరిగాయి. నేటి పరీక్షలకు 27,861 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా.. 27,677 మంది పరీక్షలు రాశారు. 184 మంది ఆబ్సెంట్ అయ్యారు. 7 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 45 సెంటర్లను, 70 కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్లు తనిఖీ చేశారు. 31 సెంటర్లలో ఓపెన్ 10th పరీక్షలు జరిగాయి. 2,386 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా.. 1,989 మంది రాశారు. 397 మంది గైర్హాజరయ్యారు.
News March 23, 2026
వనపర్తిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం: కలెక్టర్

వనపర్తి జిల్లాలోని ఘనపూర్ ఫోర్ట్, శ్రీ రంగనాయక స్వామి ఆలయం, సరళాసాగర్ వంటి చారిత్రక, పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు డీపీఆర్ సిద్ధం చేస్తే ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయిస్తామని, జిల్లాను పర్యాటక హబ్‌గా మారుస్తామని ఆయన పేర్కొన్నారు.


