News January 10, 2026

పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు: సీపీ రాజశేఖర్ బాబు

image

చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు హెచ్చరించారు. 18 నెలల్లో పోక్సో చట్టం కింద నమోదైన 44 కేసుల్లో నిందితులకు తప్పనిసరిగా శిక్ష పడేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ కేసుల్లో 4 మందికి జీవిత ఖైదు, 11 మందికి 20 ఏళ్లు, 7 మందికి 10 ఏళ్లు, మరో 22 మందికి 10 ఏళ్లలోపు జైలు శిక్షలు న్యాయస్థానాలు విధించినట్లు తెలిపారు.

Similar News

News March 13, 2026

చింతపల్లి: హైవేపై యాక్సిడెంట్.. మృతుడి వివరాలివే..

image

చింతపల్లి మండలం అంతర్ల జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో జీకేవీధి మండలం దొడ్డికొండ గ్రామానికి చెందిన జి.సత్తిబాబు అనే గిరిజనుడు మృతి చెందారు. ద్విచక్ర వాహనంపై వెళుతూ లారీని ఢీకొన్న సంగతి తెలిసిందే. ప్రమాదంలో సత్తిబాబు అక్కడికక్కడే మృతి చెందగా గంజిగడ్డ గ్రామానికి చెందిన కె. మనోహర్ అనే గిరిజనుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆయన్ను 108లో చింతపల్లి ఆస్పత్రికి తరలించారు

News March 13, 2026

జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులపై కలెక్టర్ ఆరా

image

భద్రాద్రి జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారులతో కలెక్టర్ అంకిత్ సమావేశమై మాట్లాడారు. జిల్లాలో ఉన్న నీటి వనరులు, చెరువులు, కాలువలు, ప్రాజెక్టులు, వాటి పరిధిలోని ఆయకట్టు విస్తీర్ణం, సాగునీటి లభ్యత అంశాలపై సమగ్ర సమాచారం తెలుసుకున్నారు. సాగునీటి వనరులను సమర్థవంతంగా వినియోగిస్తూ రైతులకు అవసరమైన నీటిని సకాలంలో అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు. రైతు సమస్యలను సేకరించి పరిష్కరించాలన్నారు.

News March 12, 2026

ఆసిఫాబాద్‌లో పదవ తరగతి పరీక్షల భద్రతా ఏర్పాట్లు

image

ఆసిఫాబాద్ జిల్లాలో మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పదవ తరగతి (ఎస్‌ఎస్‌సి) పరీక్షలు ప్రశాంతంగా జరగడానికి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ నితికా పంత్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 38 పరీక్షా కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధమని, కర్రలు, ఆయుధాలు, రాళ్లు, జిరాక్స్ సెంటర్లపై కఠిన ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు.