News January 10, 2026

విశాఖ జూ పార్క్‌లో స్వాన్, ఈము పిల్లల పునరుత్పత్తి

image

విశాఖ జూ పార్కులో కొన్ని వారాలుగా స్వాన్, ఈము గుడ్లను కృత్రిమంగా ఇంక్యూబేటర్‌లో పెట్టారు. శనివారం ఈ గుడ్ల నుంచి 6 ఈము పిల్లలు, ఒక బ్లాక్ స్వాన్ పిల్ల వచ్చినట్లు క్యూరేటర్ మంగమ్మ తెలిపారు. అంతేకాకుండా రెండు సాంబార్ జింకలు, రెండు నీలిగాయి, మూడు బ్లాక్ బక్స్ కూడా జన్మించినట్లు చెప్పారు. విశాఖ జూ పార్కులో వన్యప్రాణుల పరిరక్షణకు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామన్నారు.

Similar News

News February 11, 2026

EXIT POLLS.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇలా..!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లో జరిగిన ఎలక్షన్స్‌పై పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్‌‌ను విడుదల చేసింది. ఇందులో కాంగ్రెస్ 13 నుంచి 15 మున్సిపాలిటీల్లో ఛైర్మన్ పీఠం దక్కించుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఇక BRS 3 నుంచి 5 మున్సిపాలిటీల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపింది. BJP 1 నుంచి 2 మున్సిపాలిటీలు గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. ఈనెల 13న తుది ఫలితాలు. 16న ఛైర్మన్ల ఎన్నిక.

News February 11, 2026

రెవెన్యూ వ్యవస్థలో పారదర్శకతే లక్ష్యం: కలెక్టర్

image

మచిలీపట్నంలోని ‘మీ కోసం’ వేదికగా కలెక్టర్ బాలాజీ నేతృత్వంలో రెవెన్యూ అధికారుల సమగ్ర సమీక్ష జరిగింది. జిల్లాలో రెవెన్యూ రికార్డులను పక్కాగా నిర్వహించి, ప్రజలకు మరింత జవాబుదారీగా సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా 22-ఏ వివాదాల పరిష్కారం, భూ రీ-సర్వే, ఈ-కేవైసీ నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. బాధితుల నుంచి వచ్చే అర్జీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని సూచించారు.

News February 11, 2026

కామారెడ్డి జిల్లాలో అత్యధిక ఓటింగ్ శాతం ఎక్కడంటే!

image

కామారెడ్డి జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అత్యధికంగా ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 79.77% పోలింగ్ నమోదయిందని అధికారులు వెల్లడించారు. 5,110 (80.84%) పురుషులు, 5,470 (78.78%) మహిళలు, ఇతరులు 1(100%) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంలో మొదటి సాధారణ ఎన్నికల్లో సైతం ఎల్లారెడ్డిలోని అత్యధికంగా ఓటింగ్ శాతం(2020లో 84.6%) నమోదైంది.