News January 10, 2026

రికార్డు సృష్టించిన జెమీమా

image

WPLలో యంగెస్ట్ కెప్టెన్‌గా జెమీమా రోడ్రిగ్స్(25y 127days) రికార్డు సృష్టించారు. ఈ సీజన్‌లో ఆమె ఢిల్లీ క్యాపిటల్స్‌కు సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. జెమీమా తర్వాతి స్థానంలో స్మృతి మంధాన(26y 230days-2023) ఉన్నారు. కాగా ఇవాళ ముంబైతో జరుగుతున్న మ్యాచులో ఢిల్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

Similar News

News March 11, 2026

చిన్న సంస్థ.. పెద్ద దెబ్బ: అమెరికా యుద్ధ రహస్యాలు లీక్

image

చైనాకు చెందిన మిజార్‌విజన్ అనే చిన్న సంస్థ AI సాయంతో అమెరికా యుద్ధ వ్యూహాలను బట్టబయలు చేసింది. ఫిబ్రవరిలో ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ ప్రారంభానికి ముందే ఇజ్రాయెల్, సౌదీలోని అమెరికా వైమానిక స్థావరాలు, యుద్ధ విమానాలు, క్షిపణి వ్యవస్థల హై-రిజల్యూషన్ ఫొటోలను ఈ సంస్థ SMలో విడుదల చేసింది. జిలిన్-1 ఉపగ్రహాల ద్వారా సేకరించిన ఈ సమాచారం ఇరాన్ దాడులకు పరోక్షంగా సహకరించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

News March 11, 2026

శ్రీనిధి రకం కోళ్ల ప్రత్యేకత ఏమిటి?

image

శ్రీనిధి జాతి కోళ్లు గోధుమ రంగులో ఉంటాయి. నాటుకోడి గుడ్లకు సమానంగా ఈ కోడి గుడ్లు కూడా అధిక పోషకాలను కలిగి ఉంటాయి. ఈ కోళ్లు 5 నెలల వయసు నుంచే గుడ్లను పెట్టడం ప్రారంభిస్తాయి. ఏడాదికి 140 నుంచి 160 గుడ్లను పెడతాయి. అన్ని వాతావరణ పరిస్థితులను, కొన్ని రకాల వ్యాధులను తట్టుకొని జీవిస్తాయి. పొడవైన కాళ్లతో, ఆకర్షణీయంగా ఉంటాయి. పెరటికోళ్లు పెంచాలనుకునేవారికి శ్రీనిధి కోళ్లు కూడా అనుకూలమైనవి.

News March 11, 2026

IPL వాయిదా పడుతుందా?

image

MAR 28 నుంచి ప్రారంభం కావాల్సిన IPL యుద్ధంతో వాయిదా పడుతుందా? అనే సందేహం నెలకొంది. ఆటగాళ్లకు హోటళ్లలో గ్యాస్ కొరతతో ఇబ్బందులు ఎదురుకావొచ్చు. అటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే షెడ్యూల్ ఆలస్యమైంది. ఇక విమాన సర్వీసుల్లో అంతరాయం వల్ల ఫారిన్ ప్లేయర్లు రావడంపైనా అనుమానాలున్నాయి. టోర్నీ ప్రారంభం నాటికి పరిస్థితులు అదుపులోకి రాకపోతే ప్రత్యామ్నాయాలు వెతుకుతాం అని IPL ఛైర్మన్ చెప్పారు.