News January 10, 2026

విశాఖలో ముగిసిన ఇండియన్ లైట్‌హౌస్ ఫెస్టివల్ 3.0

image

విశాఖపట్నంలో జరిగిన ఇండియన్ లైట్‌హౌస్ ఫెస్టివల్ 3.0 ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ రూ.230 కోట్ల విలువైన పోర్ట్ ప్రాజెక్టులను ప్రారంభించడమే కాకుండా, ఏపీలో మొదటి లైట్‌హౌస్ మ్యూజియాన్ని ప్రకటించారు. గత దశాబ్దంలో లైట్‌హౌస్ టూరిజం 5 రెట్లు పెరిగిందని, దేశవ్యాప్తంగా మరిన్ని లైట్‌హౌస్‌లను పర్యాటక కేంద్రాలుగా మారుస్తామని ఆయన స్పష్టం చేశారు.

Similar News

News January 15, 2026

విశాఖలో డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు

image

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు డాగ్ స్క్వాడ్ సహాయంతో నగరంలో గురువారం విస్తృత తనిఖీలు చేపట్టారు. ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, కొరియర్ కార్యాలయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ విశాఖలో నిరంతర నిఘా కొనసాగించారు. గంజాయి వంటి మత్తుపదార్థాలు రవాణా కాకుండా ప్రజల భద్రత, యువత భవిష్యత్తు, రక్షణే లక్ష్యంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

News January 15, 2026

సింహాచలంలో 18న అప్పన్న తెప్పోత్సవం

image

వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి తెప్పోత్సవం ఈ నెల 18న (ఆదివారం) వరాహ పుష్కరిణిలో వైభవంగా జరగనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు కొండపై నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు తెప్పోత్సవం నిర్వహిస్తారు. అనంతరం గ్రామ తిరువీధి ఉత్సవం జరగనుంది. ఉత్సవం కారణంగా ఆ రోజు సాయంత్రం 6 గంటల వరకే భక్తులకు స్వామివారి దర్శనం లభిస్తుందని ఆలయ అధికారులు తెలిపారు.

News January 15, 2026

గాజువాక: లారీ ఢీకొట్టి వ్యక్తి మృతి

image

గాజువాక వడ్లపూడి జంక్షన్ ఆటోనగర్ వెళ్లే రహదారిలో లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన నిన్న రాత్రి జరిగింది. వడ్లపూడిలో నివాసం ఉంటున్న చింత సంతోష్ కుమార్ ఇంటికి వెళ్ళటానికి రోడ్డు దాటుతుండగా కూర్మన్నపాలెం నుంచి గాజువాక వైపు వేగంగా వెళ్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సంతోష్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.