News April 25, 2024
కర్నూలు: నిరుద్యోగి నామినేషన్ దాఖలు

కర్నూలు జిల్లా ఆస్పరికి చెందిన బోయ రంగస్వామి అనే నిరుద్యోగి బుధవారం ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేశారు. తహశీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. రంగస్వామి మాట్లాడుతూ.. పాలక, ప్రతిపక్ష పార్టీలు అవలంబిస్తున్న నిరుద్యోగ విధానాలకు వ్యతిరేకంగా యువత నడుం బిగించాలనే ఉద్దేశంతో నామినేషన్ వేసినట్లు తెలిపారు. యువత మేలుకోవాలని, భవిష్యత్తును మనమే మార్చుకోవాలని అన్నారు.
Similar News
News January 17, 2026
జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు కర్నూలు యువతి

జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు కర్నూలు బి.క్యాంప్‌కు చెందిన శ్రీహిత ఎంపికైనట్టు శిక్షకులు పాలు విజయకుమార్, బ్రహ్మ కుమార్ శుక్రవారం తెలిపారు. ఈనెల 21న నుంచి 28వ తేదీ వరకు మణిపూర్‌లో జరిగే అండర్-19 ఎస్జీఎఫ్ఐ ఫుట్‌బాల్ పోటీలలో శ్రీహిత పాల్గొంటుందని పేర్కొన్నారు. గత అక్టోబర్‌లో ఎమ్మిగనూరులో జరిగిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ఐ పోటీలలో మంచి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు వెల్లడించారు.
News January 17, 2026
కర్నూలు: సంక్రాంతి నాడు విషాదాంతాలు

సంక్రాంతి పండుగ నాడు పలు కుటుంబాల్లో విషాదం మిగిలింది. పుల్లూరు టోల్ ప్లాజా వద్ద బైక్ ఢీకొని ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మృతిచెందారు. పాణ్యం(M) తమ్మరాజుపల్లెలో వాహనం ఢీకొని రత్నమ్మ(50) మరణించింది. బేతంచెర్ల(M) శంకలాపురం గ్రామానికి చెందిన దస్తగిరి(33) బొలెరో ఢీకొని చనిపోయాడు. అప్పుల బాధతో గోనెగండ్లలో కౌలు రైతు జైనుద్దీన్, ఆదోనికి చెందిన వెంకటేశ్(42), కర్నూలుకు చెందిన శివకుమార్(33) ఉరేసుకున్నారు.
News January 17, 2026
కర్నూలులో ఉద్యోగాలకు నోటిఫికేషన్

కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో రికార్డు అసిస్టెంట్-1, ఫ్రెంట్ ఆఫీస్ కో-ఆర్డినేటర్-1, డేటా ఎంట్రీ ఆపరేటర్-1, రెగ్యులర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి తెలిపారు. గడువు ఈనెల 27 వరకు ఉందన్నారు. దరఖాస్తులను రిజిస్టర్ లేదా స్పీడ్ పోస్టు ద్వారా పంపాలన్నారు. www.ecourtskurnool.com & kurnool.dcourts.gov.inను చూడాలన్నారు.


