News January 11, 2026

కుమారుడి డ్రగ్స్ కేసు.. తొలిసారి స్పందించిన MLA ఆది

image

తన కుమారుడు డ్రగ్స్ కేసుపై MLA ఆదినారాయణరెడ్డి తొలిసారి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘సుధీర్ లండన్‌లో MBA చేశాడు. అక్కడి కల్చర్‌ ఇండియాలో వద్దని చెప్పా. నా మాట వినలేదు. పోలీసుల పరీక్షలో పాజిటివ్ వచ్చింది. ఈ కేసులో 100% రాజకీయ కోణం ఉంది. విక్టింను పట్టుకుని నన్ను విక్టిం చేయాలని చాలా మంది దుష్ర్పచారానికి దిగారు. అయినా నా వెంట్రుక కూడా పీకలేరు’ అంటూ ఘాటుగా స్పందించారు.

Similar News

News March 11, 2026

రేపు సర్పంచులు, కౌన్సిలర్లకు శిక్షణ: కలెక్టర్

image

గద్వాల జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’పై గురువారం ఒకరోజు జిల్లా స్థాయి ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. స్థానిక సంస్థల బలోపేతం, పాలనలో పారదర్శకత లక్ష్యంగా ఈ శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. విధుల్లో మెలకువలు, ప్రభుత్వ పథకాల అమలుపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.

News March 11, 2026

సూర్యాపేట: ఈ ఏడాది ఫీజలు తగ్గేనా..!

image

జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల ఫీజుల భారంపై రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణ చర్యలు ప్రారంభించడంతో తల్లిదండ్రుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. కొత్త విధానం అమల్లోకి వస్తే అడ్డగోలు వసూళ్లకు బ్రేక్ పడుతుందని భావిస్తున్నారు. అయితే, ఈ ఏడాదైనా ఫీజులు తగ్గుతాయా లేక పాత పద్ధతే కొనసాగుతుందా అని సర్వత్రా చర్చ జరుగుతోంది.

News March 11, 2026

ప్రాపర్టీ కొంటున్నారా? ఈ సర్టిఫికెట్లు చూసుకోండి

image

*టైటిల్ డీడ్: విక్రయదారుడికి అమ్మే ఆస్తిపై హక్కులు ఉన్నట్లు నిరూపిస్తుంది.
*మదర్ డీడ్: సదరు ల్యాండ్ ఓనర్షిప్ హిస్టరీ తెలుసుకోవచ్చు.
*ఎన్‌కంబ్రెన్స్ సర్టిఫికెట్ (EC): లోన్లు, లీగల్‌గా క్లియర్‌గా ఉన్నట్లు నిర్ధారిస్తుంది
*NALA కన్వర్షన్ సర్టిఫికెట్: వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా కన్వర్ట్ చేసినట్లు తేలుస్తుంది. *పట్టా సర్టిఫికెట్: ప్రభుత్వ రికార్డుల్లో ప్రాపర్టీని చూపిస్తుంది.