News January 11, 2026

WPL: ముంబై ఇండియన్స్‌ ఘన విజయం

image

WPLలో తన రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 50 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (74*), నాట్ స్కీవర్ బ్రంట్ (70) హాఫ్ సెంచరీలు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ తడబడింది. 19 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌట్ అయింది.

Similar News

News March 13, 2026

రాష్ట్రాలకు శుభవార్త.. భారీగా నిధులు

image

AP సహా 6 రాష్ట్రాలు/UTకి ₹1,913Cr అదనపు నిధుల విడుదలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆమోదం తెలిపారు. 2025లో వరదలు, మొంథా తుఫాను నష్టానికి సాయంగా ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. గుజరాత్‌కు ₹778Cr, APకి ₹341Cr, J&Kకు ₹330Cr, HPకి ₹288Cr, నాగాలాండ్‌కు ₹158Cr, ఛత్తీస్‌గఢ్‌కు ₹15Cr అందనున్నాయి. FY26లో SDRF కింద 28 రాష్ట్రాలకు ₹20,735Cr, NDRF కింద 21 రాష్ట్రాలకు ₹3,628Cr రిలీజ్ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

News March 13, 2026

మెడికల్ ఆఫీసర్ల పోస్టులకు UPSC నోటిఫికేషన్

image

కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కింద వివిధ ప్రభుత్వ విభాగాల్లోని మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి UPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1,358 పోస్టులు కాగా ఇందులో సెంట్రల్ హెల్త్ సర్వీసెస్‌లో 864 పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు రైల్వే, ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్, ఢిల్లీ కార్పొరేషన్‌లో 494 ఖాళీలు ఉన్నాయి. UPSC <>సైట్‌లో<<>> MAR 31 సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 2న పరీక్ష ఉంటుంది.

News March 13, 2026

ప్రెగ్నెన్సీలో కాస్మెటిక్స్ వాడితే ఏమవుతుందంటే?

image

ప్రెగ్నెన్సీ సమయంలో గాఢ రసాయనాలుండే పెర్‌ఫ్యూమ్‌లు, రూమ్ ఫ్రెషనర్లు, కాస్మెటిక్స్ వాడటం వల్ల ఎండోక్రైన్ సిస్టంపై ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు. వీటివల్ల బిడ్డ పుట్టుకలో లోపాలు, ట్యూమర్లు, అండంలో పెరుగుదల లోపాలు వంటివి జరగవచ్చంటున్నారు. కొన్నిసార్లు అబార్షన్ కూడా అయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఏవైనా వాడేముందు అందులో ఇంగ్రీడియంట్స్ గురించి తెలుసుకోవాలని సూచిస్తున్నారు.