News January 11, 2026
కాజీపేట: జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు 79 జట్లు

భారత ఖోఖో ఫెడరేషన్ సౌజన్యంతో తెలంగాణ ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖోఖో పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరగనున్న పోటీల్లో 29 రాష్ట్రాల నుంచి 79 జట్లు పాల్గొననున్నాయి. ఇందులో 40 పురుషుల జట్లు, 39 మహిళల జట్లు ఉన్నాయి. 200 మంది క్రీడాకారులు హాజరుకానున్నారు. నాలుగు సింథటిక్ కోర్టులను, 2 కీ కోర్టులను ఏర్పాటు చేశారు. పగలు, రాత్రి పోటీలు సాగనున్నాయి.
Similar News
News March 20, 2026
30 ఏళ్లు దాటాయా.. చర్మ సౌందర్యానికి చిట్కాలు

వయసు 30 ఏళ్లు దాటాక చర్మం నెమ్మదిగా సాగే గుణాన్ని కోల్పోతుంది. తేమనిచ్చే మాయిశ్చరైజర్ ఈ వయసులో సరిపోదు. యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఉత్పత్తులకు ప్రాధాన్యమివ్వాలి. పగలు ఇ, సి విటమిన్లు, గ్రీన్ టీ ఉన్న ఉత్పత్తులు, రాత్రి రెటినాయిడ్ క్రీములు వాడాలి. ఇవి కొలాజన్ ఉత్పత్తిని పెంచడంతోపాటు చర్మంపై ఏర్పడిన ముడతలు, గీతలను తగ్గిస్తాయి. వీటితో పాటు సన్ స్క్రీన్, ఫేషియల్ ఎక్సర్‌సైజ్‌లు చేయడం కూడా మంచిది.
News March 20, 2026
పోలవరం: విహార యాత్రలో విషాద సంఘటన

విహార యాత్రలో విషాద ఘటన మారేడుమిల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. తూ.గో జిల్లా బిక్కవోలు ఎమ్మార్వో ఆఫీస్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న శ్రీరాములు (61)గుండె పోటుతో మృతి చెందారని తోటి స్నేహితులు తెలిపారు. ఈ ప్రాంతానికి విహార యాత్రకు వచ్చిన ఆయన స్పృహ తప్పి పడిపోవడంతో తోటి స్నేహితులు రంప ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
News March 20, 2026
రేపు మార్కాపురంలో జాబ్ మేళా

మార్కాపురంలోని జార్జి ఫార్మసీ కళాశాలలో రేపు జాబ్ మేళా జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. B. Pharmacy, M. Pharmacy, B.Sc, M.Sc, B.Tech విద్యార్హతలు కలిగిన విద్యార్థులు హాజరు కావాలన్నారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్, పాస్ ఫోటోలు అలాగే జిరాక్స్ తప్పనిసరిగా తీసుకురావాలని, ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.


