News January 11, 2026
ఏలూరు జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు

జిల్లాలో రాజముద్రతో ఉన్న 9,134 పట్టాదారు పాసుపుస్తకాలను రైతులకు పంపిణీ చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. శనివారం అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. ఏలూరు డివిజన్‌లో 5,501, జంగారెడ్డిగూడెంలో 3,614, నూజివీడులో 90 పుస్తకాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కలిదిండి మండలంలో అత్యధికంగా ఉన్నాయని, జాప్యం లేకుండా వీటిని పంపిణీ చేసి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు.
Similar News
News March 20, 2026
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన భద్రాద్రి ఎస్పీ

ముస్లిం సోదర, సోదరీమణులకు ఎస్పీ రోహిత్ రాజు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లింలు ఈ పవిత్ర పండుగను కుటుంబ సభ్యులతో కలిసి అనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. రంజాన్ మాసంలో ముస్లింలు చేసిన కఠిన ఉపవాస దీక్షలను ఈద్-ఉల్-ఫితర్ పండుగతో ముగిస్తారని అన్నారు. ఈ రంజాన్ పండుగ సందర్భంగా ప్రజలందరూ సోదర భావాన్ని కలిగియుండి సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సంతోషంగా గడపాలని కోరారు.
News March 20, 2026
బడ్జెట్లో విజన్, విషయం లేదు: రాకేష్ రెడ్డి

నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో విజన్, విషయం లేదని BRS రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. ఈ బడ్జెట్ సామాన్య ప్రజలకు, పెట్టుబడిదార్లకు, మార్కెట్ కి విశ్వాసం కల్పించడంలో ఘోరంగా ఫెయిల్ అయిందని, ఆరు గ్యారంటీలకు మంగళం పాడారు, డిక్లరేషన్లకు నీళ్లు వదిలారని, ఓటు వేసిన వాళ్లకు వెన్నుపోటు పొడిచారనీ ఫైర్ అయ్యారు.
News March 20, 2026
BHPL: మీ కూతురితో సెల్ఫీ తీసుకుని బహుమతి గెలవొచ్చు..!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలో ‘సెల్ఫీ విత్ డాటర్’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పాల్గొనేవారు తమ కుమార్తెలతో సెల్ఫీ తీసుకుని 22వ తేదీ సా.5గంటలలోగా పంపించాలని జిల్లా సంక్షేమ అధికారిణి మల్లిశ్వరి తెలిపారు. ఎంపికైన ఉత్తమ సెల్ఫీలకు బహుమతులు అందిస్తామన్నారు. తమ కుమార్తెలతో సెల్ఫీ తీసుకుని ఫొటోతో పాటు వివరాలను 98489 20828 నంబర్‌కు పంపించాలన్నారు.


