News January 11, 2026
ఫ్యూచర్ సిటీ భూములు.. రైతులకు ఇవ్వాలని డిమాండ్!

గత ప్రభుత్వం సేకరించిన 19,333 ఎకరాల ఫార్మా సిటీ భూములను ప్రస్తుత ప్రభుత్వం ‘ఫ్యూచర్ సిటీ’గా మార్చడం న్యాయపరమైన వివాదాలకు దారితీస్తోంది. ఒక నిర్దిష్ట ‘ప్రజా ప్రయోజనం’ కోసం సేకరించిన భూమిని ఇతర వాణిజ్య అవసరాలకు మళ్లించడంపై 2013 భూసేకరణ చట్టంలోని సెక్షన్ 101 ప్రకారం అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నిర్దేశిత ప్రాజెక్టును రద్దు చేసినప్పుడు, ఆ భూములను తిరిగి రైతులకు అప్పగించాలనే డిమాండ్ పెరుగుతోంది.
Similar News
News March 24, 2026
హార్ముజ్‌ను తెరిచి ఉంచడం అత్యవసరం: మోదీ

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి తనకు <<19466723>>కాల్<<>> వచ్చినట్లు PM మోదీ వెల్లడించారు. పశ్చిమాసియాలో పరిస్థితులపై చర్చించినట్లు తెలిపారు. వీలైనంత త్వరగా ఉద్రిక్తతలను తగ్గించి, శాంతిని పునరుద్ధరించడానికి భారత్ మద్దతు ఇస్తుందని చెప్పారు. హార్ముజ్ జలసంధిని తెరిచి, అందుబాటులో ఉండేలా చూడటం ప్రపంచం మొత్తానికి అత్యవసరం అని పేర్కొన్నారు. శాంతి, స్థిరత్వం దిశగా జరుగుతున్న ప్రయత్నాలపై సంప్రదింపులు కొనసాగిస్తామన్నారు.
News March 24, 2026
కృష్ణా: పరీక్షల రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో నవంబరు 2025లో నిర్వహించిన MA/M.COM/MED/MHR/MPA 3వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షల రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు ఏప్రిల్ 1లోపు ఒక్కో పేపరుకు రూ.900ల ఫీజు http://www.onlinesbi.comలో చెల్లించాల్సి ఉంటుందని వర్శిటీ పరీక్షల విభాగం సూచించింది.
News March 24, 2026
చీరాలకు రానున్న సీఎం చంద్రబాబు

ఈ నెల 28న సీఎం నారా చంద్రబాబు నాయుడు చీరాల మండలంలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన ఏర్పాట్లను మంగళవారం కలెక్టర్ డా.వి. వినోద్ కుమార్, ఎస్పీ ఉమామహేశ్వర్ హెలిప్యాడ్ స్థలాలను పరిశీలించారు. అనంతరం పలు విద్యా సంస్థలు, వసతి గృహాలు, జడ్పీ పాఠశాలలను తనిఖీ చేశారు. అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.


