News January 11, 2026
29, 30న ఉప లోకాయుక్త క్యాంప్ సిట్టింగ్

విశాఖ జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈనెల 29, 30వ తేదీల్లో ఏపీ ఉప లోకాయుక్త పి.రజని ఆధ్వర్యంలో క్యాంప్ సిట్టింగ్ నిర్వహించనున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు ఈ క్యాంప్‌లో పాల్గొని ప్రభుత్వ అధికారుల అవినీతి, విధి నిర్వహణలో నిర్లక్ష్యంపై కొత్త ఫిర్యాదులు అందజేయవచ్చునని ఆమె తెలిపారు. పారదర్శక పాలనే లక్ష్యంగా జరిగే ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News March 25, 2026
GNT: చంద్రబాబుకు స్వాగతం పలికిన కలెక్టర్, ఎస్పీ, కమిషనర్

సీఎం చంద్రబాబును కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్, జీఎంసీ కమిషనర్ మయూర్ మర్యాదపూర్వకంగా కలిశారు. గుంటూరు నగరంలో జరిగిన ఎమ్మెల్యే ధూళ్ళిపాళ్ల నరేంద్ర కుమార్తె వివాహానికి బుధవారం చంద్రబాబు విచ్చేశారు. ఈ క్రమంలో కలెక్టర్, ఎస్పీ, కమిషనర్ పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.
News March 25, 2026
ఇందిరపై కామెంట్స్.. సభలో బీజేపీ Vs కాంగ్రెస్

TG: ఇందిరపై రాకేశ్ రెడ్డి <<19474706>>కామెంట్స్<<>> సభలో BJP-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఆమెపై అలాంటి వ్యాఖ్యలు హరీశ్ రావు సహా ఎవరు చేసినా సరికాదని మంత్రి శ్రీధర్ బాబు అనడంతో BRS MLA సంజయ్, BJP MLAలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రాకేశ్ రెడ్డి అడ్డుపడ్డారు. దీంతో వారిని కూర్చోండంటూ మంత్రి ఆగ్రహించారు. ఇక రాకేశ్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని, రికార్డుల నుంచి తొలగించాల్సిన అవసరం లేదని ఏలేటి అన్నారు.
News March 25, 2026
ALERT: HYD పెట్రోల్ బంకుల్లో CASH ONLY!

నగరంలోని పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. ఆయిల్ కంపెనీలు ‘అడ్వాన్స్ పేమెంట్’ నిబంధన తేవడంతో డీలర్లు నగదు కోసం UPI, కార్డు చెల్లింపులు నిలిపివేసి ‘ఓన్లీ క్యాష్’ బోర్డులు తగిలించారు. సాధారణ పెట్రోల్ లేదంటూ ఖరీదైన ప్రీమియం రకాలను అమ్ముతూ సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారు. యుద్ధం వస్తుందన్న పుకార్లతో జనం ఎగబడటంతో బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూలు కనిపిస్తున్నాయి.


