News January 11, 2026

MDK: సంక్రాంతి వేళ అప్రమత్తత అవసరం: ఎస్పీ

image

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు ఊర్లకు వెళ్లే సమయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాస రావు సూచించారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగలు చోరీలకు పాల్పడే అవకాశమున్నందున నగదు, బంగారు ఆభరణాలను బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, చోరీల నివారణకు ప్రజల సహకారం కీలకమని పేర్కొన్నారు.

Similar News

News March 14, 2026

మెదక్: తీవ్ర విషాదం.. కార్మికుడి మృతి!

image

శివంపేట్ మండలంలోని గోమారంలో విషాదం నెలకొంది. వీధి లైట్ల మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి పంచాయతీ కార్మికుడు నీరుడి రాములు (48) విద్యుత్ స్తంభం పైనుంచి కిందపడిపోయారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News March 14, 2026

మెదక్: జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం

image

మెదక్ జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 68 కేంద్రాల్లో 11,247 మంది విద్యార్థులు (5,577 బాలురు, 5,670 బాలికలు) పరీక్షలకు హాజరవుతున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండటంతో పాటు జిరాక్స్ సెంటర్లను మూసివేయించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

News March 14, 2026

మహిళల సాధికారతకు ప్రభుత్వం కృషి: మంత్రి దామోదర

image

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఓ హాస్పిటల్‌లో ‘షి పవర్’ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విమెన్స్ కాంక్లేవ్’లో మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘షి పవర్ మొబైల్ యాప్’ను ఆయన ఆవిష్కరించారు. మహిళా సాధికారతపై జరిగిన ప్యానెల్ డిస్కషన్‌లో వివిధ రంగాల మహిళా నిపుణులు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు హాజరయ్యారు.