News January 11, 2026
కామారెడ్డి: రోడ్డు నిబంధనలు పాటించాలి

వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని కామారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ సూచించారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో పలు వాహన డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. రోడ్డు నిబంధనలకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేశారు. వాహనాలు నడిపేటప్పుడు డ్రైవర్లు పలు జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు.
Similar News
News February 22, 2026
పార్వతీపురం: PGRS అర్జీల వివరాల ‘మీ కోసం’

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీల వివరాలు ‘మీ కోసం’ వెబ్‌సైట్‌లో నమోదు చేయవచ్చని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. సమర్పించిన అర్జీల స్థాయిని 1100 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని కలెక్టర్ చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అన్ని కార్యాలయాల్లో ప్రజల సమస్యలు సోమవారం స్వీకరిస్తామన్నారు.
News February 22, 2026
మెంటేవారితోట: 1,000 పెన్నులతో బాల త్రిపుర సుందరికి అలంకరణ

ఇంటర్ మీడియట్ పరీక్షల్లో భాగంగా భీమవరం మెంటేవారితోటలోని శ్రీబాలత్రిపుర సుందరిదేవి అమ్మవారికి 1,000 పెన్నులతో ఆదివారం ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్వర్యంలో దాతల సహకారంతో ఆలయ అర్చకుడు శ్రీనివాస్ అమ్మవారికి కుంకుమ పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం 1,000 పెన్నులతో అమ్మవారిని అలంకరించారు. ఈ పెన్నులను విద్యార్థులకు అందజేస్తామని ఆలయ కమిటీ తెలిపింది.
News February 22, 2026
వనపర్తి: 108 అంబులెన్స్ సేవలకు కొత్త డిస్ట్రిక్ట్ మేనేజర్

వనపర్తి జిల్లా 108 అంబులెన్స్ సేవల డిస్ట్రిక్ట్ మేనేజర్‌గా డి.రత్నమయ్య బాధ్యతలు స్వీకరించారు. అత్యవసర సమయాల్లో వేగవంతమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. GVK EMRI ఆధ్వర్యంలోని 108, 102 సేవల నాణ్యతను మరింత మెరుగుపరుస్తామని, ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో ఈ నంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.


