News January 11, 2026
కామారెడ్డి: రోడ్డు నిబంధనలు పాటించాలి

వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని కామారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ సూచించారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో పలు వాహన డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. రోడ్డు నిబంధనలకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేశారు. వాహనాలు నడిపేటప్పుడు డ్రైవర్లు పలు జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు.
Similar News
News February 2, 2026
పెసరపిండి దీపం ఎందుకు వెలిగించాలంటే..?

ఇంట్లో దారిద్ర్యం తొలగి, లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే పెసరపిండి దీపం వెలిగించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వారు ఈ దీపారాధన చేయడం వల్ల సుఖశాంతులు చేకూరుతాయి. పెసరపిండి దీపం బుధ గ్రహానికి ప్రీతికరమైనది, కాబట్టి ఇది వ్యాపార అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది. నిత్యం పేదరికం వేధిస్తున్నా, సంపాదన నిలకడగా లేకపోయినా ఈ దీపాన్ని వెలిగిస్తే అద్భుతమైన మార్పులు కనిపిస్తాయని పండితులు చెబుతున్నారు.
News February 2, 2026
రష్యా దాడిలో 15 మంది ఉక్రెయిన్ పౌరులు మృతి

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా నిప్రో నగరంపై జరిపిన డ్రోన్ అటాక్‌లో 15 మంది మరణించారు. నిప్రోపెట్రోవ్స్క్ ప్రాంతంలోని DTEK విద్యుత్ ఉత్పత్తి సంస్థ గనులపై రష్యా దాడులకు పాల్పడింది. షిఫ్ట్ ముగించుకొని బస్సులో ఇంటికి బయల్దేరిన కార్మికులు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లు ఆ సంస్థ పేర్కొంది. మరోవైపు అబుదాబీ వేదికగా FEB 4,5 తేదీల్లో అమెరికా, రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలు జరగనున్నాయి.
News February 2, 2026
కర్నూలు: ‘30 ఏళ్ల తర్వాత ఒక్కటయ్యారు’

వెల్దుర్తి మండలం కలగొట్ల జడ్పీహెచ్ పాఠశాలలో 1995-96లో చదివిన పదో తరగతి పూర్వ విద్యార్థులు అపూర్వ సమ్మేళన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. 30 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న విద్యార్థులు పాఠశాల రోజుల మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కల్లూరు ఎంఈవో శ్రీనివాసులు, విశ్రాంత ఉపాధ్యాయులు మునీశ్వరరావు, మహేశ్వర్ రెడ్డి పాల్గొని సూచనలు చేశారు.


