News January 11, 2026
కామారెడ్డి: పేకాట శిబిరంపై దాడి.. ఐదుగురి అరెస్టు

రామారెడ్డి మండలం ఉప్పల్వాయిలో పేకాట స్థావరంపై పోలీసులు శనివారం దాడి నిర్వహించారు. గ్రామంలోని ఓ ఇంట్లో పేకాట నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు చేపట్టామని ఎస్సై రాజశేఖర్ తెలిపారు. ఐదుగురిని అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ.21,930 నగదు, 5 మొబైల్ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
Similar News
News March 4, 2026
జాన్సెన్ దూకుడు.. SA స్కోర్ ఎంతంటే?

T20WC: NZతో జరుగుతున్న సెమీఫైనల్లో సౌతాఫ్రికా బ్యాటర్లు తడబడ్డారు. కివీస్ బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేశారు. మార్క్రమ్ 18, డికాక్ 10, బ్రెవిస్ 34, మిల్లర్ 6, స్టబ్స్ 29 రన్స్ చేశారు. రచిన్ రవీంద్ర, మెక్‌కొంచి, హెన్రీ రెండేసి వికెట్లు తీశారు. ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్ 30 బంతుల్లోనే 55* రన్స్ చేశారు. 5 సిక్సర్లు, 2 ఫోర్లతో విరుచుకుపడ్డారు.
News March 4, 2026
బాపట్ల: ‘క్రమబద్ధమైన ప్రాక్టికల్స్ నిర్వహించాలి’

బాపట్లలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదుల కొరతతో బాలికల పాఠశాల విద్యార్థినీలు ఇబ్బందులు పడుతున్న విషయంపై ఆరా తీశారు. నిలిచిపోయిన అదనపు గదుల నిర్మాణాలపై విద్యాశాఖ అధికారులతో ఫోన్‌లో చర్చించారు. మౌలిక సదుపాయాలు కల్పించి గదులను ఆధునికీకరిస్తామని హామీ ఇచ్చారు. నాణ్యమైన బోధన, క్రమబద్ధమైన ప్రాక్టికల్స్ నిర్వహించాలని సూచించారు.
News March 4, 2026
భూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలి: కలెక్టర్

ఏలూరు జిల్లాలోని 16 గ్రామాల్లో 1983 పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేశామని కలెక్టర్ వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ భూపరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ జయలక్ష్మికి తెలిపారు. ఏపీ సచివాలయం నుంచి బుధవారం జిల్లా కలెక్టర్లతో సీసీఎల్ఏ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. 22 ఏ భూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నామని కలెక్టర్ వివరించారు.


