News January 11, 2026
పల్నాడు: జంగా V/S భాను ప్రకాశ్.. టీటీడీలో ఏం జరుగుతోంది..?

టీటీడీ స్థలం కేటాయింపు విషయంలో జంగా కృష్ణమూర్తి V/S భాను ప్రకాశ్ రెడ్డి ఎపిసోడ్ సంచలనం సృష్టిస్తుంది. టీటీడీ నిబంధనల ప్రకారమే తనకు స్థలం కేటాయిస్తూ బోర్డు అనుమతించిందని జంగా అంటున్నారు. ప్రైవేటు వ్యక్తులకు స్థలం కేటాయించడం టీటీడీ నిబంధనలకు విరుద్ధమని, అందుకే తాను తీర్మానాన్ని సమావేశంలో వ్యతిరేకించానని భాను ప్రకాశ్ అంటున్నారు. వివాదం వెనుక ఏమి జరిగింది, ఎవరున్నారు అనే విషయంపై చర్చ నడుస్తోంది.
Similar News
News March 4, 2026
₹17 లక్షల డ్రోన్ కోసం ₹33 కోట్ల మిస్సైల్: ఇరాన్ ‘కాస్ట్ వార్’ వ్యూహం!

సుమారు ₹17 లక్షల విలువైన ఇరాన్ షాహెద్ డ్రోన్లను కూల్చడానికి అమెరికా ₹33 కోట్ల విలువైన పేట్రియాట్ మిస్సైళ్లను వాడుతున్నట్లు సమాచారం. ఈ వ్యూహంతో అమెరికా రక్షణ నిల్వలను దెబ్బతీయాలని ఇరాన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఖతర్ వంటి దేశాల వద్ద మిస్సైల్ నిల్వలు కొన్ని రోజులకు మాత్రమే సరిపోతాయని విశ్లేషణలు వస్తున్నాయి. ఆయుధాలు ఎవరి దగ్గర ముందుగా అయిపోతాయన్నదే ఈ యుద్ధ గమనాన్ని నిర్ణయించనుంది.
News March 4, 2026
NLG: నేటి నుంచి ఇంటర్ వ్యాల్యూయేషన్

ఇంటర్ పరీక్షల మూల్యాంకనం ప్రక్రియ జిల్లాలో నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలుత సంస్కృతం పేపర్ మూల్యాంకనం షురూ అవుతుండగా ఈ నెల 15న మరో 4 సబ్జెక్టులు, 16, 17న మిగిలిన సబ్జెక్టులు ప్రారంభించనున్నారు. NLGలోని కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సంస్కృతం సబ్జెక్ట్ వ్యాల్యూయేషన్ కోసం ఉత్తర్వులు అందుకున్న అధ్యాపకులంతా ఉదయం 9 గంటలకు క్యాంపు ఆఫీసర్ వద్ద రిపోర్టు చేయాలని DIEO తెలిపారు.
News March 4, 2026
అనంతపురంలో పడిపోయిన ధరలు

చీనీ, టమాటా ధరలు క్రమక్రమంగా తగ్గుముఖం పట్టడంతో అనంతపురం జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. అనంతపురం మార్కెట్ యార్డులో టన్ను చీనీ కాయలు గరిష్ఠంగా రూ.25,000, కనిష్ఠంగా రూ.8 వేల ధర పలికింది. అనంతపురం శివారులోని కక్కలపల్లి టమాటా బండిలో క్వింటా టమాటా గరిష్ఠంగా రూ.8 వేలు, కనిష్ఠంగా రూ.4 వేల ప్రకారం ధర పలికింది.


