News January 11, 2026

ఖమ్మం: ‘అన్న’ అనుకుంటే అంతం చేశాడు!

image

ఖమ్మంలో ప్రమీల అనే <<18814797>>మహిళ <<>>దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. సోదరుడి వరుసయ్యే శ్రవణ్, ఆమెను ఆర్థికంగా వాడుకోవడమే కాకుండా భర్తకు దూరం చేశాడు. పద్ధతి మార్చుకోవాలని ఆమె హెచ్చరించడమే అతడి కక్షకు కారణమైంది. శుక్రవారం అర్ధరాత్రి బావమరిది రమేశ్‌తో కలిసి మార్గమధ్యంలో ఆమెను అడ్డగించి కిరాతకంగా గొంతుకోసి హతమార్చాడు. ఈ ఘాతుకం స్థానికంగా కలకలం రేపగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News March 18, 2026

జీవీఎంసీలో కలెక్టర్ పాలన.. అధికారుల్లో గుబులు

image

జీవీఎంసీ పాలకవర్గం పదవీకాలం ముగియడంతో కార్పొరేషన్ నేటి నుంచి ప్రత్యేక అధికారి పాలనలోకి వెళ్లింది. కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆధ్వర్యంలో పరిపాలన సాగనుంది. టౌన్ ప్లానింగ్ విభాగంపై ఎక్కువ ఫిర్యాదులు రావడంతో కలెక్టర్ గతంలోనే అసంతృప్తి వ్యక్తం చేశారు. హెచ్చరికలు, మెమోలు ఇచ్చినా మార్పు లేదు. ప్రస్తుతం ఆయన పాలనాపగ్గాలు చేపట్టడంతో వారిలో ఆందోళన పెరిగింది. ఇటీవల పలు జోన్లలో ఏసీబీ తనిఖీలు జరగడం గమనార్హం.

News March 18, 2026

పల్నాడు: మంత్రి లోకేశ్‌ను కలిసిన కొమ్మాలపాటి

image

మంత్రి నారా లోకేశ్‌ను ఉండవల్లిలోని నివాసంలో పల్నాడు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు పలు అంశాలపై ఆయన మంత్రితో చర్చించారు. కాగా కొమ్మాలపాటి వరుసగా పెదకూరపాడు నియోజకవర్గం టికెట్ ఆశించినా రాకపోవడంతో పాటు, పల్నాడు జిల్లా అధ్యక్షుడు పదవి కూడా పోవడంతో ఆయన సన్నిహితులు నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మంత్రి లోకేశ్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

News March 18, 2026

ఆ కళ్లద్దాలతో న్యూడ్, బెడ్‌రూమ్ దృశ్యాలు రికార్డ్!

image

మెటా AI స్మార్ట్ గ్లాసెస్ వినియోగదారుల అత్యంత వ్యక్తిగత దృశ్యాలను రికార్డ్ చేసి కెన్యాలోని రివ్యూయర్లకు పంపిస్తున్నట్లు స్వీడిష్ పత్రికల ఇన్వెస్టిగేషన్‌లో తేలింది. దాని ప్రకారం.. న్యూడ్, బెడ్‌రూమ్, బాత్‌రూమ్ దృశ్యాలతో పాటు బ్యాంక్ కార్డుల వివరాలు అక్కడి సిబ్బందికి చేరుస్తున్నాయి. బ్లర్ చేసే టెక్నాలజీ పనిచేయక వ్యక్తుల ముఖాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో మెటాపై క్లాస్ యాక్షన్ దావా నమోదైంది.