News January 11, 2026
తిరుమలలో జాగ్రత్త..!

వరుస సెలవులతో తిరుమలలో రద్దీ ఏర్పడింది. కొండపై చలి సైతం పెరిగింది. చిన్నారులు, వృద్ధులతో వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలి. చలిని తట్టుకునేలా తగిన వస్తువులు తీసుకు రావడం ఉత్తమం. అలాగే తిరుమలలో తెలియని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఇటీవల నాగరత్నమ్మ అనే మహిళ ఓ భక్తురాలికి మత్తుమందు కలిపిన పాలు ఇచ్చి క్యూలైన్‌లో బంగారు తాళిబొట్టు <<18821755>>దోచేసింది. <<>>సో కొండపై తెలియని వ్యక్తులు ఇచ్చే పదార్థాలు తీసుకోవద్దు.
Similar News
News January 19, 2026
పాలమూరు: మున్సిపల్ పోరుకు సిద్ధం.. త్వరలో షెడ్యూల్..!

మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది. దీంతో త్వరలో షెడ్యూల్ విడుదల కానుంది. రిజర్వేషన్లు ఖరారు కావడంతో గెలుపు గుర్రాల కోసం కాంగ్రెస్, BRS, BJP, CPI, CPM, BSP తదితర పార్టీలు అన్వేషిస్తున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 1 కార్పొరేషన్, 19 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకునేందుకు పార్టీలు ప్రచార బరిలోకి దిగుతున్నాయి.
News January 19, 2026
మాఘ మాసంలో పర్వదినాలు

చంద్ర దర్శనం(JAN 20), లలితా వ్రతం(21), వసంత పంచమి(23), రథసప్తమి(25), భీష్మాష్టమి(26), మధ్వనవమి(27), అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణం(28), భీష్మ ఏకాదశి(29), వరాహ ద్వాదశి వ్రతం, పక్ష ప్రదోషం(30), విశ్వకర్మ జయంతి(31), మాఘ పౌర్ణమి, సతీదేవి జయంతి(FEB 1), సౌభాగ్య వ్రతం(2), సంకష్టహర చవితి(5), మంగళవ్రతం(9), విజయ ఏకాదశి(13), తిల ద్వాదశి, పక్ష ప్రదోషం(14), మహాశివరాత్రి(15), ధర్మ అమావాస్య(17).
News January 19, 2026
నేడు కేజీబీవీ ఉద్యోగాల ప్రాథమిక జాబితా విడుదల

కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలల్లో 100 నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థుల ప్రాథమిక ఎంపిక జాబితా నేడు విడుదల కానుంది. ఈ పోస్టులకు భారీగా దరఖాస్తులు రావడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 23, 24 తేదీలలో ఇంటర్వ్యూలు నిర్వహించి, అనంతరం తుది జాబితాను ప్రకటిస్తారు. ఎంపికైన అభ్యర్థులు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి విధుల్లో చేరాల్సి ఉంటుంది.


