News January 11, 2026
కోచ్ జెలెజ్నీకి నీరజ్ చోప్రా గుడ్‌బై

భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తన కోచ్ జాన్ జెలెజ్నీతో విడిపోతున్నట్లు ప్రకటించారు. సానుకూల వాతావరణంలోనే వేర్వేరు దారులు ఎంచుకున్నట్లు తెలిపారు. టెక్నిక్, రిథమ్ వంటి వాటిలో కోచ్ ప్రోత్సాహం మరువలేనిదన్నారు. ఇతని ట్రైనింగ్‌లోనే నీరజ్ తన కెరీర్‌లో తొలిసారి 90 మీటర్ల మార్క్‌ను దాటారు. 2028 ఒలింపిక్స్ లక్ష్యంగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ జోడీ ఏడాది పాటు కలిసి పని చేసింది.
Similar News
News February 20, 2026
అజ్ఞాతంలోకి YCP ఎమ్మెల్సీ అనంతబాబు!

AP: YCP MLC అనంతబాబు భార్య లక్ష్మీదుర్గపై సిట్ ఛార్జ్‌షీట్ దాఖలు చేయడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. గన్‌మెన్లు, వ్యక్తిగత సిబ్బంది లేకుండా ఇవాళ శాసనమండలి సమావేశాల నుంచి ఆయన అర్ధాంతరంగా వెళ్లిపోయినట్లు సమాచారం. ఇప్పటికే అనంతబాబు భార్య కోసం పోలీసుల గాలిస్తున్నారు. తమ మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యలో భర్తను ప్రేరేపించడమే కాకుండా అన్ని విధాలా ఆమె సహకరించారని సిట్ పేర్కొంది.
News February 20, 2026
జుట్టు జిడ్డు ఇలా తగ్గిద్దాం..

కాలుష్యం, దుమ్మూ తోడై కొందరి జుట్టు త్వరగా జిడ్డుగా మారుతుంది. దానికోసం ఈ చిట్కాలు.. * షాంపూలో స్పూన్ కలబంద, కాస్త నిమ్మరసం చేర్చి బాగా కలిపి తలకు పెట్టుకోవాలి. ఈ మిశ్రమంతో వారానికి రెండుసార్లు తలస్నానం చేయాలి. * రెండు స్పూన్ల ముల్తానీమట్టికి తగినంత నీరు కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. * తలస్నానం చేసిన జుట్టుకు బ్లాక్ టీని పట్టించి ఇరవైనిమిషాల తర్వాత కడిగేయాలి.
News February 20, 2026
జప మాలను మెడలో ధరించవచ్చా?

జపానికి వాడే మాలను మెడలో ధరించకూడదని పండితులు సూచిస్తున్నారు. కేవలం జపం కోసమే ప్రత్యేకంగా ఉంచాలని చెబుతున్నారు. జపమాలకు సంబంధించి కొన్ని నియమాలు.. భగవంతుని శక్తిని జాగృతం చేసే జపంలో ఏకాగ్రత ముఖ్యం. జపమాల 108 పూసలతో ఉండటం ఉత్తమం. 54, 27 లేదా 9 పూసలున్న మాలలను కూడా వాడొచ్చు. రుద్రాక్ష, తులసి వంటి పదార్థాలు మంత్ర శక్తిని శరీరంలోకి చేరవేసే వాహకాలుగా పనిచేస్తాయి.


