News January 11, 2026
నల్గొండ ‘కార్పొరేషన్’.. గెజిట్ కోసం నిరీక్షణ!

నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా మారుస్తూ శాసనసభ, మండలి ఆమోదించిన బిల్లు గవర్నర్ వద్ద ఉంది. దీనిపై గెజిట్ విడుదల కావాల్సి ఉండటంతో ఎన్నికల నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. ఇప్పటికే అధికారులు ఓటర్ల ముసాయిదా జాబితాను సిద్ధం చేసినప్పటికీ, తుది జాబితా ప్రదర్శనను ప్రస్తుతానికి నిలిపివేయాలని ఆదేశాలు అందినట్లు సమాచారం. గెజిట్ వెలువడితేనే 48 వార్డుల పునర్విభజన, మేయర్ పదవి రిజర్వేషన్లపై స్పష్టత రానుంది.
Similar News
News February 10, 2026
నల్గొండ: పుర పోరులో.. పెరిగిన ఓటు విలువ!

మున్సిపల్ ఎన్నికల్లో ప్రచార పర్వం ముగియడంతో తాయిలాల పంపిణీకి తెరలేచింది. అభ్యర్థులు ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో రూ.లక్షలు కుమ్మరిస్తుండడంతో ఓటు విలువ పెరిగింది. జిల్లాలో నల్గొండ కార్పొరేషన్ సహా మిర్యాలగూడ, హాలియా, చండూర్, దేవరకొండ, చిట్యాల, నందికొండ మున్సిపాల్టీల్లో భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. నల్గొండలో ఒక్కో డివిజన్‌లో రూ.50 లక్షల పైగానే డబ్బు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం.
News February 10, 2026
ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు సహకరించాలి: నల్గొండ ఎస్పీ

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అత్యంత అప్రమత్తమైంది. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన నాకాబందీ చేపట్టారు. 48 గంటల ‘మౌన కాలం’ అమల్లోకి రావడంతో ప్రచారాలు, సభలపై నిషేధం విధించారు. సెక్షన్ 163 అమలు చేస్తూ అక్రమ నగదు, మద్యం తరలింపుపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని ఎస్పీ కోరారు.
News February 9, 2026
NLG: మున్సిపల్ పోలింగ్.. రెండు రోజులు సెలవులు: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల పరిధిలోని అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 10, 11 తేదీల్లో రెండు రోజుల పాటు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్ తెలిపారు. ఈ ఉత్తర్వులు నల్గొండ కార్పొరేషన్, మిర్యాలగూడ, హాలియా, నందికొండ, చండూరు, దేవరకొండ, చిట్యాల మున్సిపాలిటీలకు వర్తిస్తాయని పేర్కొన్నారు.


