News January 11, 2026

పార్వతీపురం: రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

భామిని మండలంలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కొత్తూరు గ్రామానికి చెందిన శంకర్ బాలేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నైట్ వాచ్‌మెన్‌‌గా పనిచేస్తున్నాడు. డ్యూటీ నిమిత్తం శనివారం సాయంత్రం ఆసుపత్రికి బైక్‌పై బయలుదేరాడు. దారిలో ఎద్దుల బండిని ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన శంకర్‌ని స్థానికులు అంబులెన్సులో ఆసుపత్రి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు.

Similar News

News April 6, 2026

పెద్దపల్లి: ‘అర్హులైన అందరికీ HPV టీకాలు అందించాలి’

image

అర్హులైన బాలికలందరికీ HPV టీకాలు అందేలా చూడాలని కలెక్టర్ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. ఇవాళ ఆయన కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ అరుణశ్రీ, డీసీపీ రామ్ రెడ్డితో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెద్దపల్లి, గోదావరిఖని, మంథని, సుల్తానాబాద్ ఆసుపత్రులతోపాటు అన్ని పీహెచ్సీలలో ఉ.9:30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. 14-15 సం. బాలికలు నియోగించుకోవాలన్నారు.

News April 6, 2026

VZM: ట్రాఫిక్ పోలీసులకు సమ్మర్ కిట్స్

image

మండుటెండలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు ఉపశమనంగా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ సమ్మర్ కిట్స్ సోమవారం పంపిణీ చేశారు. బ్యాగ్, హ్యాట్, వాటర్ బాటిల్‌లతో కూడిన కిట్స్‌ను స్థానిక ట్రాఫిక్ స్టేషన్‌లో సిబ్బందికి అందజేశారు. వేసవి తీవ్రత దృష్ట్యా పని గంటల్లో మార్పులు చేయడంతో పాటు ప్రతిరోజూ మజ్జిగ, ఓఆర్‌ఎస్ అందించాలని ట్రాఫిక్ సీఐకి ఎస్పీ ఆదేశించారు.

News April 6, 2026

ప్రజలు ఆహార భద్రతలో రాజీ పడొద్దు: మహేందర్ జి

image

ప్రజలు ఆహార భద్రతలో రాజీ పడొద్దని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సిహెచ్ మహేందర్ జి అన్నారు. ములుగు కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నాణ్యమైన ఆహారమే ఆరోగ్యానికి మేలని పేర్కొన్నారు. గడువు తేదీలు పరిశీలించి వస్తువులు కొనాలని సూచించారు. పాఠశాలలు, హాస్టళ్లలో శుభ్రతతో ఆహారం తయారు చేయాలని, హోటల్స్ నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు.