News January 11, 2026

పాలమూరు: బాలుడి ప్రాణం తీసిన బైక్ సరదా

image

కల్వకుర్తిలో విషాదం నెలకొంది. పోలీసుల వివరాలు.. గాంధీనగర్‌కు చెందిన రఘుపతి, సునీత దంపతుల కొడుకు సాయి ప్రణీత్(13) నిన్న వరుసకు మామ అయిన వారి ఇంటికి వెళ్లాడు. అక్కడ బైక్ తాళాలు ఉండటంతో ఎవరికీ చెప్పకుండా స్టార్ట్ చేశాడు. రోడ్డుపై అతివేగంతో వెళ్తూ మలుపు తిప్పే క్రమంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News March 16, 2026

కౌంటర్ దాఖలు చేయండి.. లిక్కర్ కేసు నిందితులకు ఢిల్లీ HC ఆదేశం

image

లిక్కర్ స్కామ్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ సవాల్ చేయగా ఢిల్లీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. దీనిపై కౌంటర్ ధాఖలు చేసేందుకు మరికొంత సమయం కావాలని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, కల్వకుంట్ల కవిత సహా ఇతర నిందితులు ధర్మాసనాన్ని కోరారు. దీంతో వచ్చే నెల 5 వరకు తప్పనిసరిగా కౌంటర్ వేయాలని జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఆదేశించారు. తదుపరి విచారణ APR 6కు వాయిదా చేశారు.

News March 16, 2026

పెద్దపులి కోసం బెంగుళూరు నుంచి ప్రత్యేక బృందాలు..?

image

కొడిమ్యాల మండలం గంగారాం తండాలో రెండు రోజులుగా పశువులపై పెద్ద పులి దాడి చేయడంతో గంగారాం తండా, దమ్మయ్య పేట సూరంపేట గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. బెంగుళూరు నుంచి ప్రత్యేక బృందాలు వస్తున్నట్లు సమాచారం. అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. రాత్రి పూట బయటకు రావద్దని వారు ప్రజలకు తెలిపారు.

News March 16, 2026

ఆస్కార్ వేదికపై కోట శ్రీనివాసరావుకు నివాళి

image

98వ ఆస్కార్ అవార్డుల ప్రకటన సందర్భంగా గత ఏడాది కాలంలో చనిపోయిన సినీ ప్రముఖులకు అకాడమీ నివాళులర్పించింది. వీరిలో తెలుగు నటుడు కోట శ్రీనివాసరావు, బాలీవుడ్ యాక్టర్స్ ధర్మేంద్ర, సరోజాదేవి, మనోజ్ కుమార్ ఉన్నారు. రాబ్ రైనర్, రాబర్ట్ రెడ్‌ఫోర్డ్, రాబర్ట్ డువాల్, కేథరీన్ ఓహారా, డయాన్ కీటన్ వంటి హాలీవుడ్ తారలనూ అకాడమీ గుర్తు చేసుకుంది.