News January 11, 2026
KU: వన దేవతల సేవలకు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సిద్ధం

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో అన్ని జిల్లాల నుంచి మేడారం జాతరకు ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో 400 మంది వాలంటీర్లు, 20 మంది ప్రోగ్రాం అధికారులు, యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ పాల్గొననున్నారు. జాతర సందర్భంగా భక్తులకు తాగునీటి పంపిణీ, జంపన్నవాగు వద్ద సేవలు, మెడికల్ క్యాంప్ నిర్వహణ, మిస్సింగ్ పాయింట్‌లో సహకారం, గద్దెల వద్ద క్యూలైన్ క్రమబద్ధీకరణ వంటి సేవలు చేయనున్నారు.
Similar News
News February 22, 2026
నంద్యాల: ధర భళా.. దిగుబడి డీలా!

నంద్యాల జిల్లాలో మిర్చి రైతులు వింత పరిస్థితి ఎదుర్కొంటున్నారు. మార్కెట్‌లో ధర భళా అనిపించినా దిగుబడి డీలా పడటంతో అన్నదాతలకు నష్టాలు తప్పడం లేదు. జిల్లా వ్యాప్తంగా 15 వేల ఎకరాల్లో మిర్చి సాగు చేయగా ఎన్నడూ లేని విధంగా క్వింటా రూ.20,000-23,000 పలుకుతోంది. అయితే దిగుబడి ఎకరాకు 25 క్వింటాళ్లు రావాల్సి ఉండగా.. 10-15 క్వింటాళ్ల లోపే వస్తోందని వాపోతున్నారు. అధిక వర్షాలు, తెగుళ్లతో నష్టం వాటిల్లింది.
News February 22, 2026
సభలోకి దేవుళ్ల ఫొటోలు ఎందుకు తీసుకెళ్లొద్దు?: భూమన

AP: దేవాలయాల్లాంటి అసెంబ్లీ, మండలిలోకి దేవుళ్ల ఫొటోలు ఎందుకు తీసుకెళ్లకూడదని TTD మాజీ ఛైర్మన్, YCP నేత భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్నోసార్లు బూట్లు ధరించే దేవుడి ఫొటోలను పలువురికి కానుకగా ఇచ్చారని ఆరోపించారు. కల్తీ నెయ్యిపై ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చట్ట విరుద్ధమని అన్నారు. ఇటీవల వైసీపీ ఎమ్మెల్సీలు మండలిలోకి శ్రీవారి ఫొటోలు తీసుకురావడంపై కూటమి నేతలు మండిపడిన సంగతి తెలిసిందే.
News February 22, 2026
మల్యాల: కాలువలో కారు బోల్తా.. BJP నేత మృతి

మల్యాల వరద <<19208074>>కాలువలో కారు బోల్తా<<>> పడిన ఘటనలో పెగడపల్లి(M) సుద్దపల్లికి చెందిన BJP నేత తిర్మని రమణ(53) మృతిచెందారు. ఈనెల 18న ఇంటి నుంచి కారులో వెళ్లిన ఆయన తిరిగి రాకపోవడంతో పెగడపల్లి PSలో కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. MISSING కేసు నమోదైంది. కాగా మృతుడు ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పోటీచేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే కారు ప్రమాదవశాత్తు కాలువలో పడిందా, ఏదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది.


