News January 11, 2026

మన పల్నాడే పందేం కోళ్లకు అసలైన కేరాఫ్!

image

కోడి పందేలు అనగానే APలోని ఉభయగోదావరి జిల్లాలు గుర్తుకొస్తాయి. అయితే కోడి పందేలు చరిత్ర శతాబ్దాల వెనక్కి వెళ్లితే ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాటి వీరగాథ ముందుకొస్తుంది. కోడి పందేలే కారణంగా పల్నాడు యుద్ధంలో రక్తపాతం జరిగింది. సామాజిక విభేదాలు, అధికార పోరాటాలు కోడి పందేల చుట్టూ ముదిరి చరిత్రలో చెరగని ముద్ర వేశాయి. సంక్రాంతి సందర్భంగా జిల్లాలో కోడి పందేలు చరిత్రగా, ఒక రకంగా సంప్రదాయంగా ఉన్నాయి.

Similar News

News March 11, 2026

పోలవరం: పులి దాడిలో మరణించిన పశువులకు నష్టపరిహారం ఎంతో తెలుసా..?

image

పోలవరం జిల్లాలో పెద్దపులి సంచరించి పశువులపై దాడి చేసి చంపుతుండడం తెలిసిందే. అయితే పులి దాడిలో మృతి చెందిన ప్రతి జంతువులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వనున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఆవు, గేదె, తదితర పశువులకు రూ.15వేలు, అదే దూడలు అయితే రూ.5వేలు నష్టపరిహారం ఇచ్చేలా అధికారులు నిర్ణయించారు.

News March 11, 2026

నెల్లూరు: meesho- ఉమెన్స్ డే గిఫ్ట్ పేరుతో లింకు వైరల్

image

సామాజిక మాధ్యమాల్లో meesho ప్రశ్నావళి అని, ప్రశ్నలకు సమాధానం చెబితే లక్ష వరకు గిఫ్ట్ గెలుచుకోవచ్చని ఓ లింకు వైరల్‌గా మారింది. ఈ లింకును క్లిక్ చేస్తే.. వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వస్తుంది. ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ఆఫర్ 12వ తేదీ వరకు ఉన్నట్లు చూపిస్తుంది. అయితే ఇలాంటి లింకులను నమ్మవద్దని అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

News March 11, 2026

నపుంసకత్వాన్ని దాచి పెళ్లి.. భర్తపై కేసు

image

నపుంసకత్వాన్ని దాచి వివాహం చేసుకున్న భర్త, అత్తమామలపై నవవధువు విజయవాడలోని గవర్నర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. నంద్యాలకు చెందిన యువతికి కడప యువకుడితో గతేడాది వివాహం జరిగింది. వివాహం తర్వాత భర్త సంసారానికి దూరంగా ఉంటూ వేధించడంతో నిలదీశారు. ఈ క్రమంలో ఇరుకుటుంబాల మధ్య గొడవ జరిగింది. నపుంసకత్వం విషయాన్ని ఎవరికైనా చెబితే చంపెస్తామని వధువును భర్త, అత్తమామలు బెదిరించడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు.