News January 11, 2026

ఆదిలాబాద్: జర్వంతో బాలుడి మృతి

image

జర్వంతో బాలుడు(14) మృతిచెందిన ఘటన ఉట్నూర్‌లో చోటుచేసుకుంది. గ్రామస్థుల ప్రకారం.. మండలంలోని కుమ్మరికుంటకు చెందిన భగవంత్‌రావ్-మరుబాయిల కుమారుడు మెంగురావ్ ASFలో పీవీటీజీలో 8వ తరగతి చదువుతున్నాడు. 4 రోజుల క్రితం జ్వరం రావడంతో ఉట్నూర్, అనంతరం రిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌ ఉస్మానియాకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. మృతదేహం శనివారం స్వగ్రామానికి చేరుకుంది.

Similar News

News February 18, 2026

HYDలో మళ్లీ 2BHK ఇండ్లు

image

HYD జిల్లాలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బుధవారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, రెండు పడకల గదుల ఇండ్లపై సమీక్షించారు. స్థలాలు సేకరించి G+5-10 ఇందిరమ్మ ఇళ్లు కట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. పెండింగ్‌లో ఉన్న 2BHK ఇళ్ల పనులు కూడా పూర్తి చేసి అర్హులకు అందించాలని అధికారులకు మంత్రి సూచించారు.

News February 18, 2026

భూభారతి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి: ASF కలెక్టర్

image

బుధవారం ASF కలెక్టరేట్‌లో భూ సమస్యలపై కలెక్టర్ హరిత సమీక్ష నిర్వహించారు. భూభారతి పోర్టల్‌లో వచ్చిన దరఖాస్తులను తహశీల్దార్ ఫైళ్లతో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని సూచించారు. తిరస్కరణల కారణాలు నమోదు చేయడం, ప్రజావాణి సమస్యల పరిష్కారం, కారుణ్య నియామకాల కింద వచ్చిన దరఖాస్తుల నివేదికలను సమర్పించడాన్ని పర్యవేక్షించాలని వివరించారు.

News February 18, 2026

హైదరాబాద్‌లో మళ్లీ 2BHK ఇండ్లు