News January 11, 2026
ప.గో: పందెపు బరుల ఏర్పాటు.. బౌన్సర్లతో భద్రత!

సంక్రాంతి సమీపిస్తుండటంతో జిల్లాలోని ప్రధాన ప్రాంతాల్లో కోడిపందాల బరుల ఏర్పాటు వేగవంతమైంది. పొలాలు, లేఅవుట్లను చదును చేసి, ప్రేక్షకుల కోసం భారీ గ్యాలరీలు, అతిథుల కోసం ప్రత్యేక విడిది సౌకర్యాలను నిర్మిస్తున్నారు. పందేల వద్ద గొడవలు జరగకుండా ముందస్తుగా ప్రైవేట్ బౌన్సర్లను సైతం నియమిస్తున్నారు. పండుగకు ముందే పందెం రాయుళ్ల హడావుడితో ఊళ్లన్నీ కళకళలాడుతున్నాయి.
Similar News
News March 14, 2026
పశ్చిమగోదావరిలో మార్చి 16 నుంచి ఒంటిపూట బళ్లు

ఎండల తీవ్రత దృష్ట్యా పశ్చిమగోదావరి జిల్లాలో మార్చి 16 సోమవారం నుంచి ఒంటిపూట బళ్లు నిర్వహించాలని విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఆదేశించారు. ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వులు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వర్తిస్తాయని తెలిపారు. ఎండల నుంచి విద్యార్థులను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
News March 14, 2026
ప.గో: గ్యాస్ కష్టాలు.. బ్లాక్‌లో సిలిండర్ రూ.1800

జిల్లాలో గ్యాస్ సిలిండర్ల ధరల మోతతో పాటు సర్వర్ల మొరాయింపుతో ఇబ్బందులు పడుతున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. బుకింగ్ కోసం అర్ధరాత్రి వరకు వేచి చూడాల్సి వస్తోందని, ఓటీపీ వస్తేనే ఏజెన్సీలు సిలిండర్లు ఇస్తున్నాయని వాపోతున్నారు. ఇదే అదనుగా బ్లాక్ మార్కెట్ లో రూ.1400 నుంచి రూ.1800 వరకు వసూలు చేస్తున్నారని సమాచారం. అధికారులు స్పందించి అక్రమ విక్రయాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.
News March 13, 2026
ప.గో : వైసీపీ నియోజకవర్గ పరిశీలకుల నియామకం

పశ్చిమగోదావరి జిల్లాలోని ఆరు నియోజకవర్గాలకు వైసీపీ పరిశీలకులను నియమించింది. శుక్రవారం రాత్రి ఈ మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం నియామక ఉత్తర్వులను జారీ చేసింది. యడ్ల తాతాజీ (ఆచంట), పేరిచర్ల విజయ నరసింహారాజు (పాలకొల్లు), ముప్పిడి సంపత్ కుమార్ (నర్సాపురం) ఫొటో, కొట్టు నాగేంద్ర (తణుకు) ఫొటో, వేండ్ర వెంకటస్వామి (తాడేపల్లిగూడెం), ఏఎస్. రాజు (ఉండి) నియమితులయ్యారు.


