News January 11, 2026
నేడు మేడారానికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు

మేడారానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీతక్క, మంత్రులు సురేఖ, పొంగులేటి, శ్రీధర్ బాబు, పొన్నం ఆదివారం రానున్నారు. ఉదయం 11:45 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 12:30 గంటలకు మేడారం చేరుకోనున్నారు. మేడారంలో చేపట్టిన అభివృద్ధి పనులు పరిశీలించి, అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్ ద్వారా HYDకు వెళ్లనున్నారు.
Similar News
News March 16, 2026
నెల్లూరు: ‘గ్యాస్’ సమస్యలా.. కాల్ చేయండి.!

జిల్లాలో గ్యాస్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు JC వెంకటేశ్వర్లు తెలిపారు. గ్యాస్ సరఫరాలో ఆలస్యం, అధిక ధరలు వసూలు చేయడం, గ్యాస్ బుకింగ్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌కు 9492273897 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. గ్యాస్ సిలిండర్ల సరఫరాకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
News March 16, 2026
కామారెడ్డి: ఏసీబీ రైడ్స్.. ఆర్థిక లావాదేవీలపై అక్రమాల గుర్తింపు

కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ రేంజ్ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. ఏసీబీ సోదాల్లో రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, దరఖాస్తులు తదితర కార్యకలాపాల తనిఖీలు నిర్వహించారు. 2025-26లో అనధికార నిర్మాణాల్లో 47 ఫిర్యాదులు వచ్చాయని, కోటి రూపాయల వరకు బకాయిలు రావాల్సి ఉన్నాయని, ప్రాపర్టీ టాక్స్‌లో తేడాలున్నట్లు గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు.
News March 16, 2026
ఏలూరు: సబ్సిడీ సిలెండర్ల పట్టివేత

కామవరపుకోట మండలంలో వాణిజ్య అవసరాలకు గృహ అవసరాల గ్యాస్ (సబ్సిడీ) సిలిండర్లను వినియోగిస్తున్నట్లు సమాచారం అందుకున్న విజిలెన్స్ సీఐ ప్రసాద్ సిబ్బందితో కలిసి సోమవారం దాడులు నిర్వహించారు. శివ గాయత్రి హోటల్, తడికలపూడి, మణికంఠ భోజన హోటల్ కామవరపుకోటలో తనిఖీలు చేశారు. అక్రమంగా వినియోగిస్తున్న 7 సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను ఆయన గుర్తించారు. వాటి విలువ రూ.19,806లు ఉంటుందని, యజమానులపై కేసు నమోదు చేశామన్నారు.


