News April 25, 2024

ఇవే నా చివరి ఎన్నికలు: మండలి బుద్ధప్రసాద్

image

ఇవే తన చివరి ఎన్నికలని అవనిగడ్డ జనసేన MLA అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కోడూరు మండలం దింటిమెరకలో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. తనను ఈ ఎన్నికల్లో ఆశీర్వదిస్తే నాలుగేళ్లుగా బీడుగా ఉన్న 4వేల ఎకరాలను సాగు భూమిగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. తీర ప్రాంత గ్రామాల పరిరక్షణ కోసం కరకట్ట మరమ్మతులు వేయించి తాగు, సాగు నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటానని ఆయన చెప్పారు.

Similar News

News January 12, 2026

కృష్ణా జిల్లాలో మరో ఇసుక రీచ్‌కు సన్నాహాలు..!

image

కృష్ణా జిల్లాలో మరో ఇసుక రీచ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. జిల్లాలో ప్రస్తుతం 4 ఇసుక రీచ్‌లు ఉన్నాయి. నార్త్ వల్లూరు, రొయ్యూరు, చోడవరం, పడమటలంకలో ఉన్న ఇసుక రీచ్‌లలో 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉంది. ఘంటసాల మండలం పాపవినాశనంలో మరో రీచ్‌ను ఏర్పాటుకు కలెక్టర్ చర్యలు చేపట్టారు. టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

News January 12, 2026

కృష్ణా: రికార్డు స్థాయి పందేం ఇదే.. అందరి నోట ఒక్కటే మాట!

image

కోడి పందేల చరిత్రలో రికార్డు స్థాయి పందేలు సంచలనం సృష్టిస్తున్నాయి. గతంలో సీసలి బరిలో జరిగిన రూ. 25 లక్షల పందెం ఒక ఎత్తైతే, తాడేపల్లిగూడెంలో ఏకంగా రూ. 1.25 కోట్ల పందేం జరగడం పందెం రాయుళ్లను విస్మయానికి గురిచేసింది. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన ప్రభాకర్ ఈ భారీ పందేంలో నెగ్గి చరిత్ర సృష్టించారు. దీంతో ఈ ప్రాంతంలో పందేలకు క్రేజ్ అమాంతం పెరిగింది.

News January 12, 2026

మచిలీపట్నంలో మీకోసం కార్యక్రమం: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు కలెక్టర్ డి.కె. బాలాజీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని ఆయన సూచించారు.