News January 11, 2026

తిరుమలలో జాగ్రత్త..!

image

వరుస సెలవులతో తిరుమలలో రద్దీ ఏర్పడింది. కొండపై చలి సైతం పెరిగింది. చిన్నారులు, వృద్ధులతో వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలి. చలిని తట్టుకునేలా తగిన వస్తువులు తీసుకెళ్లండి. అలాగే తిరుమలలో అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి. ఇటీవల నాగరత్నమ్మ అనే మహిళ ఓ భక్తురాలికి మత్తుమందు కలిపిన పాలు ఇచ్చి క్యూలైన్‌లో బంగారు తాళిబొట్టు <<18821755>>దోచేసింది. <<>>సో కొండపై తెలియని వ్యక్తులు ఇచ్చే పదార్థాలు తీసుకోవద్దు.

Similar News

News January 21, 2026

రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్‌మెంట్‌లో ఉద్యోగాలు

image

రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్‌మెంట్‌ <>(RGNIYD) <<>>6 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల వారు రేపు ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును PG (ఎకనామిక్స్, సోషియాలజీ, యూత్ స్టడీస్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషల్ వర్క్, యూత్ డెవలప్‌మెంట్), NET/SLAT/SET, PhD ఉత్తీర్ణులు అర్హులు. నెలకు రూ.52వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.rgniyd.gov.in

News January 21, 2026

ఆదిలాబాద్: తొలిసారిగా JEE మెయిన్స్ పరీక్షలు

image

దేశవ్యాప్తంగా ఎన్ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని నలంద కళాశాలలో తొలిసారిగా పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 21, 22, 23, 24, 28వ తేదీల్లో రెండు విడతల్లో పరీక్షలు జరగనున్నాయి. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని నిబంధన విధించడంతో అభ్యర్థులు ముందుగానే కేంద్రానికి చేరుకున్నారు. అధికారులు తనిఖీలు చేసి విద్యార్థులను లోపలికి అనుమతించారు.

News January 21, 2026

వేములవాడ రాజన్న ఆలయంలో టెండర్ల సెగ

image

వేములవాడ శ్రీ భీమేశ్వరాలయంలో కొబ్బరి ముక్కలు పోగు చేసుకోవడం, పచ్చి గడ్డి, అరటి పండ్లు, పత్రి విక్రయించడం, బెల్లం, పూజా సామగ్రి విక్రయం, లాకర్స్ నిర్వహణ హక్కుల టెండర్లకు స్పందన కనిపించడం లేదు. వరుసగా రెండోసారి టెండర్ పిలిచినప్పటికీ ఆశించిన ఆదాయం రాకపోవచ్చనే అనుమానంతో టెండర్లకు కాంట్రాక్టర్లు ఆసక్తి చూపించడం లేదు. దీంతో ఆలయ అధికారులు తల పట్టుకుంటున్నారు.