News January 11, 2026

దుప్పట్లు, సబ్బుల తయారీలో ‘చర్లపల్లి’ ఖైదీలు

image

చర్లపల్లి ఖైదీలు దుర్రీలు, కార్పెట్లు నేయడంతో పాటుగా, ఫినైల్, సబ్బులు, సానిటైజర్లు, డిటర్జెంట్లు పౌడర్లు తయారు చేస్తున్నారు. బేకరీ ఉత్పత్తులు, షర్టులు, ట్రౌజర్లు, హాఫ్ కోట్లు, డోర్ మ్యాట్లు, యోగా మ్యాట్లు, బెడ్ షీట్లు, టేబుల్స్, కుర్చీలు వంటి వస్తువులనూ తయారీ చేస్తున్నారు. ఈ వినూత్న సంస్కరణలకు ప్రిజన్స్ DG సౌమ్య మిశ్రా శ్రీకారం చుట్టారు.

Similar News

News March 24, 2026

IPL: అత్యల్ప స్కోరు ఆర్సీబీదే!

image

ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక స్కోరు(287) రికార్డు సన్ రైజర్స్ హైదరాబాద్ పేరిట <<19457522>>ఉంటే<<>>.. అత్యల్ప స్కోర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నమోదు చేసింది. 2017లో కోల్‌కతా(KKR)పై బెంగళూరు (RCB) చేసిన 49 రన్స్ నేటికీ లీగ్ చరిత్రలో అత్యల్పం. ఆ తర్వాత వరుసగా రాజస్థాన్ రాయల్స్ (58, 59), ఢిల్లీ (66, 67) పరుగులతో ఉన్నాయి. 2008లో ముంబై బౌలర్ల ధాటికి KKR కూడా 67 పరుగులకే కుప్పకూలింది.

News March 24, 2026

పశ్చిమాసియా సంక్షోభం.. కేంద్ర మంత్రుల కీలక భేటీ

image

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో పార్లమెంటు హౌస్‌లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కీలక భేటీ జరుగుతోంది. ఈ మీటింగ్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఎరువుల మంత్రి నడ్డా హాజరయ్యారు. మరోవైపు ఇదే అంశంపై రేపు ఆల్ పార్టీ మీటింగ్‌కు కేంద్రం <<19464829>>పిలుపునిచ్చిన<<>> విషయం తెలిసిందే.

News March 24, 2026

13 నూతన అంబులెన్సుల కొనుగోలు.. టెండర్లకు ఆహ్వానం

image

అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజన ప్రాంతాల ప్రజలకు అత్యవసర వైద్య సేవలు మెరుగుపరిచేందుకు 13 నూతన అంబులెన్సులను కొనుగోలు చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్, జిల్లా కొనుగోలు కమిటీ చైర్మన్ తిరుమాని శ్రీ పూజ తెలిపారు. నీతి ఆయోగ్ నిధులతో సుమారు రూ.1.50 కోట్ల వ్యయంతో ఈ అంబులెన్సులు కొనుగోలు చేయనున్నారు. టెండర్ ప్రక్రియ ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు.