News January 11, 2026

NRPT: పరీక్షల వేళ విద్యార్థులకు ‘ప్రత్యేక’ అల్పాహారం

image

ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు జరుగుతున్న ప్రత్యేక తరగతుల సందర్భంగా సాయంత్రం పౌష్టికాహార చిరుతిళ్లు అందించనున్నారు. ఉడకబెట్టిన పెసర్లు, శనగలు, మిల్లెట్ బిస్కెట్లు, పల్లీలు–బెల్లం వంటి ఆహారం ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 16 నుంచి ఉమ్మడి జిల్లాలోని 459 ప్రభుత్వ పాఠశాలల్లో 19,495 మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. ప్రతి విద్యార్థికి రోజుకు రూ.15 చొప్పున 38 రోజులకు రూ.570 ఖర్చు చేయనున్నారు.

Similar News

News March 18, 2026

నిర్మల్ జిల్లాలోని త్వరలో ‘కిసాన్ మేళా’: కలెక్టర్

image

నిర్మల్ జిల్లాలో త్వరలోనే ‘కిసాన్ మేళా’ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ఈ మేళాలో సేంద్రీయ వ్యవసాయం, కిచెన్ గార్డెనింగ్, రూఫ్‌టాప్ గార్డెనింగ్‌పై ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రగతిశీల రైతుల అనుభవాలను ఇతరులతో పంచుకునేలా కార్యక్రమాలు రూపొందించాలని, ఆధునిక సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలని ఆమె స్పష్టం చేశారు.

News March 18, 2026

ఖమ్మం: విద్యుత్ కనెక్షన్లు ఇక సులభం

image

కొత్త విద్యుత్ కనెక్షన్ల ప్రక్రియను సరళతరం చేస్తూ ఖమ్మం ఎస్ఈ శ్రీనివాసాచారి నూతన సర్వీస్ లైన్ ఛార్జీల విధానాన్ని ప్రకటించారు. ఇకపై క్షేత్రస్థాయి పరిశీలన అవసరం లేకుండా కేవలం లోడ్ ఆధారంగానే ఏకరీతి ఛార్జీలు వసూలు చేయనున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ ఖర్చును విద్యుత్ సంస్థే భరిస్తుందని, దీంతో వినియోగదారులపై అదనపు భారం ఉండదన్నారు. ఈ నూతన విధానంతో కనెక్షన్ల ప్రక్రియలో వేగం, పారదర్శకత పెరుగుతాయని తెలిపారు.

News March 18, 2026

MBNR: ‘తొలిసారిగా డిజిటల్‌లో జనాభా గణన’

image

జనాభా గణనను దేశంలో తొలిసారిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నారని కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. మొబైల్ యాప్‌లు, వెబ్ పోర్టల్‌లను ఉపయోగించి గణన ప్రక్రియను నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు తమ వివరాలను తామే స్వయంగా ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకునేందుకు ప్రత్యేక పోర్టల్‌ను ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. 2021లో నిర్వహించవలసిన ఈ ప్రక్రియ కోవిడ్ కారణంగా ఆలస్యం అయిందన్నారు.