News January 11, 2026
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలపై కేటీఆర్ సమీక్ష

ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్ నాయకులతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం సమావేశమయ్యారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ భేటీలో భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ మంత్రి పువ్వాడ, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, హరిప్రియ నాయక్, తాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 21, 2026
టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల ఎంపికలో పారదర్శకత: కలెక్టర్

జనగామ జిల్లాలో జనగణన–2026 కోసం<<19442246>> టెక్నికల్ అసిస్టెంట్<<>>, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేశామన్నారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుకు ఇంటర్వ్యూల ద్వారా ఒకరిని ఎంపిక చేసినట్లు వెల్లడించారు.
News March 21, 2026
దానం నాగేందర్‌పై హైకోర్టులో పిటిషన్

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దానం పార్టీ మారలేదని ఇటీవల స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయం వెల్లడించడంతో బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. దానం బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరారని, కాంగ్రెస్ సీటుపై ఎంపీగా పోటీ చేశారని పేర్కొన్నారు. పిటిషన్‌లో దానం పేరుతో పాటు స్పీకర్ పేరును కూడా చేర్చారు.
News March 21, 2026
ప్రకాశం: ‘రేపు కూడా కరెంట్ బిల్లులు చెల్లించవచ్చు’

ప్రకాశం జిల్లాలో ఆదివారం అయినా విద్యుత్ బిల్లు కౌంటర్లు తెరిచి ఉంటాయని SE కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. వినియోగదారుల సౌకర్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని అన్ని కౌంటర్లు పనిచేస్తాయని వెల్లడించారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. నిర్ణీత సమయంలో బిల్లు చెల్లించడం వలన పెనాల్టీ పడదని అన్నారు.ఆన్‌లైన్‌లో కూడా బిల్లులు చెల్లించవచ్చని చెప్పారు.


