News January 11, 2026
నల్గొండ: ఏసీబీలో ‘లీక్’ వీరులు..!

అవినీతి తిమింగలాలను పట్టించాల్సిన ACBలోనే కొందరు ‘లీకు వీరులు’ తయారవ్వడం కలకలం రేపుతోంది. దాడులు నిర్వహించాల్సిన సిబ్బందే, సదరు అవినీతి అధికారులకు ముందస్తు సమాచారం ఇస్తూ వారి నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నల్గొండ ఏసీబీ విభాగంలో పనిచేస్తున్న ఓ CI, హోంగార్డు కలిసి ఈ దందాను నడిపిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో విచారణ మొదలైనట్లు తెలుస్తోంది.
Similar News
News March 20, 2026
NGKL: భక్తిశ్రద్ధలతో రంజాన్ జరుపుకోవాలి – కలెక్టర్

ముస్లింల పవిత్ర పండుగ రంజాన్‌ను భక్తిశ్రద్ధలతో, ఘనంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ సంతోష్ ఆకాంక్షించారు. నెలరోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలకు నెలవంక దర్శనమివ్వడంతో రేపు పండుగ జరుపుకుంటున్న సందర్భంగా ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని ముస్లిందరికీ ఈ పండుగ సుఖసంతోషాలను ఇవ్వాలని ఆయన కోరారు.
News March 20, 2026
పెట్రోల్, డీజిల్ ధరలపై IOCL కీలక ప్రకటన

అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నప్పటికీ దేశంలో సాధారణ వాహన ఇంధన ధరలను పెంచబోమని IOCL ప్రకటించింది. ప్రీమియం పెట్రోల్ XP-95(పవర్ పెట్రోల్) రేట్లను మాత్రమే పెంచామని, ఈ ప్రభావం స్వల్ప స్థాయిలోనే ఉంటుందని తెలిపింది. సరసమైన ధరల్లో స్థిరమైన సరఫరాకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. కాగా <<19432956>>పవర్ పెట్రోల్<<>> లీటర్‌పై రూ.2.35 వరకు, ఇండస్ట్రియల్ డీజిల్ లీటర్‌పై రూ.22 పెంచిన విషయం <<19434174>>తెలిసిందే.<<>>
News March 20, 2026
అభివృద్ధి పనుల ప్రణాళికలు సిద్ధం చేయాలి: మంత్రులు

వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు ప్రారంభమయ్యేనాటికి భద్రాచలంలో పుష్కర ఘాట్‌తో పాటు మొదటి దశ ఆలయ అభివృద్ది పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని శుక్రవారం మంత్రులు సురేఖ, పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. భద్రాచలాన్ని తెలంగాణలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక హబ్‌గా మారుస్తామన్నారు. భద్రాచలం సమీపంలోని రామవరంలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.


