News January 11, 2026

పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ ఎంట్రీ

image

నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ గాయపడిన <<18824096>>పంత్<<>> న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. అతని స్థానంలో ధ్రువ్ జురెల్‌ను ఎంపిక చేసినట్లు BCCI సెక్రటరీ దేవజిత్ సైకియా తెలిపారు. అయితే రెగ్యులర్ కీపర్‌గా రాహుల్ ఉన్న నేపథ్యంలో రెండో వికెట్ కీపర్‌గా ఎంపికైన జురెల్‌కు ప్లేయింగ్ 11లో చోటు దక్కడం కష్టమని క్రీడావర్గాలు చెబుతున్నాయి. కాగా ఇవాళ 1.30pmకు వడోదరాలో తొలి వన్డే ప్రారంభం కానుంది.

Similar News

News February 12, 2026

అరవ శ్రీధర్ రావట్లేదా?.. అసెంబ్లీ లాబీలో చర్చ

image

AP: ఓ మహిళతో వివాహేతర సంబంధం ఆరోపణలు <<19038842>>ఎదుర్కొంటున్న<<>> రైల్వే కోడూరు జనసేన MLA అరవ శ్రీధర్‌ గురించే ఇవాళ అసెంబ్లీ లాబీలో ఎక్కువసేపు చర్చ సాగినట్లు తెలుస్తోంది. శ్రీధర్ అసెంబ్లీకి రావట్లేదా? అంటూ మిగతా ఎమ్మెల్యేలు చర్చించుకున్నారట. అయితే ఈ సెషన్ మొత్తానికి ఆయన్ను రావద్దని జనసేన అధిష్ఠానం ఆదేశించినట్లు సమాచారం. అటు బయట పార్టీ కార్యక్రమాల్లోనూ శ్రీధర్ కనిపించడం లేదు.

News February 12, 2026

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కొత్త హెల్త్ పాలసీ

image

TG: ప్రభుత్వ ⁠ఉద్యోగులు, పెన్షనర్లకు కొత్త హెల్త్ పాలసీ అమల్లోకి రానుంది. దీంతో ఎంప్యానెల్డ్ హాస్పిటల్స్‌లో పరిమితి లేని వైద్య సదుపాయాలు ఉంటాయి. ఉద్యోగులు, పెన్షనర్ల బేసిక్ పేలో 1.5%, సర్కార్ 1.5% కలిపి మొత్తం 3%(ఏటా సుమారు రూ.1000Cr) కేటాయించనుంది. పథకం ప్రారంభమైన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు, మోడల్ స్కూల్స్, గురుకులాల సిబ్బందినీ ఇందులోకి తీసుకొచ్చే అవకాశముంది. దీనికోసం కమిటీని ఏర్పాటు చేయనుంది.

News February 12, 2026

ఈ 3 ఆహారాలు.. ‘లివర్’ కిల్లర్స్

image

శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో <<19090434>>లివర్<<>> ఒకటి. దాన్ని ఈ 3 రకాల ఫుడ్స్ నాశనం చేస్తాయంటున్నారు వైద్యులు.
షుగర్ డ్రింక్స్: సోడాస్, ఫ్రూట్ జూస్‌లు, ఎనర్జీ డ్రింక్స్.. లివర్‌కు విషం లాంటివి.
డీప్ ఫ్రైడ్ ఫుడ్: ఇలాంటి ఆహారం తింటే లివర్ సెల్స్ డ్యామేజీ అవుతాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్, వాపు పెరుగుతుంది.
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్: చిప్స్, క్యాండీస్, హాట్ డాగ్స్, న్యూడుల్స్.. సీరియల్ కిల్లర్స్ లాంటివి.
#Shareit