News January 11, 2026
మేడారం: టూర్లతో పనులకు బ్రేకులు!

అసలే మేడారం జాతరకు టైమ్ లేదు. మరోపక్క ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ఇప్పటికే 7 సార్లు వచ్చిన మంత్రి పొంగులేటి, ఆదివారం మరోసారి వస్తున్నారు. ఆయనతో పాటుగా నలుగురు మంత్రులు వస్తుండటంతో జాతర పనులకు ఆటంకం ఏర్పడుతుందని కార్మికులు వాపోతున్నారు. అసలే సమయం లేకపోగా, మంత్రుల వరుస పర్యటనతో 3 నుంచి 4 గంటల పాటు పనులు నిలిచిపోతున్నాయి. మరోపక్క భక్తులు సైతం పోటెత్తుండటంతో ఈ పనులు కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు.
Similar News
News March 27, 2026
రాష్ట్రాలకు కమర్షియల్ ఎల్పీజీ సరఫరా పెంపు

రాష్ట్రాలకు కమర్షియల్ ఎల్పీజీ సరఫరాను కేంద్ర ప్రభుత్వం 50% నుంచి 70%కి పెంచింది. ఈ మేరకు రాష్ట్రాలకు పెట్రోలియం శాఖ లేఖలు రాసింది. ఉక్కు, రసాయనాలు, ఆటో మొబైల్స్, వస్త్రాలు, రంగుల వంటి పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ప్రీ క్రైసిస్ కోటాను 40% నుంచి 50%కి పెంచింది. మరోవైపు దేశంలో యూరియా కొరత లేదని, సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు.
News March 27, 2026
భద్రాచలం నుంచి HYDకు సీఎం రేవంత్ రెడ్డి

భద్రాద్రిలో సీతారాముల కళ్యాణ వేడుకను వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుగు ప్రయాణమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు సారపాకలోని హెలిప్యాడ్ నుంచి ఆయన హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. సీఎం వెంట మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు సీఎంకు ఘనంగా వీడ్కోలు పలికారు.
News March 27, 2026
HYD: కోడిపై విద్యార్థిని వినూత్న ప్రేమ

HYDలోని రహ్మత్‌నగర్‌కు చెందిన ఎంబీఏ విద్యార్థిని సంతోషిణి తన పెంపుడు కోడిపై ప్రేమను వినూత్నంగా చాటుకున్నారు. ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్లడం ఇష్టం లేక.. రంధ్రాలున్న బ్యాగులో కోడిని ఉంచి తన ద్విచక్ర వాహనంపై స్నేహితురాలి ఇంటికి తీసుకెళ్లారు. గతంలో రెండు కోడిపిల్లలను తెచ్చుకోగా.. వాటిలో ప్రస్తుతం ప్రాణంతో ఉన్న ఈ కోడిని తను ఎంతో అపురూపంగా పెంచుతున్నట్లు ఆమె తెలిపారు.


