News April 25, 2024

ఒకే రోజు ఇద్దరు నామినేషన్లు.. చంద్రగిరిలో హైటెన్షన్

image

చంద్రగిరి నియోజకవర్గంలో హైటెన్షన్ నెలకొంది. ఇవాళే టీడీపీ, వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్ధం కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇద్దరు అభ్యర్థులు భారీ జనసమీకరణ చేయడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. తాను నామినేషన్ వేసే రోజే మోహిత్ రెడ్డి నామినేషన్ వేయడం కుట్రలో భాగమని నాని ఆరోపిస్తున్నారు. పార్టీ శ్రేణులు సమన్వయం పాటించాలని ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

Similar News

News October 13, 2025

చిత్తూరు: నేటి నుంచి విధుల్లోకి కొత్త టీచర్లు

image

DSC-2025 ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు ఇవాళ వారికి కేటాయించిన పాఠశాలలో జాయిన్ కానున్నారు. ఈ మేరకు DEO వరలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. నూతన ఉపాధ్యాయులు 11 రోజుల శిక్షణ పూర్తిచేసుకున్నారు. SGTలకు మ్యానువల్ పద్ధతిలో స్కూల్ అసిస్టెంట్లకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించారు.

News October 13, 2025

చిత్తూరు జిల్లా ప్రజలకు గమనిక

image

చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ఉదయం 10.30 గంటలకు పాత డీపీఓ కార్యాలయంలో కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రజలు తమ సమస్యలపై వినతులు ఇవ్వొచ్చని ఆయన కోరారు.

News October 12, 2025

చిత్తూరు జిల్లా ప్రజలకు గమనిక

image

చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేధిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ఉదయం 10.30 గంటలకు పాత డీపీఓ కార్యాలయంలో కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రజలు తమ సమస్యలపై వినతులు ఇవ్వొచ్చని ఆయన కోరారు.