News January 11, 2026
తిరుపతి: ఇక్కడ మగవాళ్లే పూజలు చేస్తారు..!

తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లిలో ఆదివారం పొంగళ్లు పెట్టారు. ఇక్కడి శ్రీసంజీవరాయ స్వామికి మగవారే పొంగళ్లు పెట్టి పూజలు చేయడం ఇక్కడి అనవాయితీ. ఆలయంలో ఆడవారికి ప్రవేశం లేదు. ఏటా సంక్రాంతి ముందు వచ్చే ఆదివారం ఈ పొంగళ్లు పెడతారు. దేశ విదేశాల్లో ఉన్న మగవాళ్లు సైతం ఇక్కడికి వచ్చి పొంగళ్లు పెట్టడం విశేషం.
Similar News
News February 16, 2026
ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: ADB కలెక్టర్

జిల్లాలో ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం పరీక్షల నిర్వహణకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరగనున్న పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని సూచించారు.
News February 16, 2026
పాలమూరు యూనివర్సిటీ ఫలితాల విడుదల

పాలమూరు యూనివర్సిటీలోని పరిపాలన భవనంలో ఎం-ఫార్మసీ, బీ-ఫార్మసీ పరీక్ష ఫలితాలను యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ జిఎన్.శ్రీనివాస్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.రమేష్ బాబు ఇవాళ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ కే.ప్రవీణ, ఫార్మసీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ రవికాంత్, ఎగ్జామినేషన్ కో-ఆర్డినేటర్స్ డాక్టర్ ఎ.ఈశ్వర్ కుమార్, డా.బి.సురేష్ పాల్గొన్నారు.
News February 16, 2026
నారాయణపేట బంగారానికి త్వరలో భౌగోళిక గుర్తింపు

దేశంలో ప్రఖ్యాతిగాంచిన నారాయణపేట బంగారానికి త్వరలో భౌగోళిక గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయని బులియన్ మర్చంట్ అసోసియేషన్ చీఫ్ కో ఆర్డినేటర్ సాకేత్ భట్టాడ్ తెలిపారు. ఇక్కడి 24 క్యారెట్ బంగారానికి, ఆభరణాలకు ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు. సరాఫ్ బజార్‌లో బంగారు వ్యాపారానికి 150 ఏళ్ల చరిత్ర ఉందని, 150 మంది వ్యాపారులు ఉంటారని అన్నారు. ఇక్కడ చేసే బంగారు నగలు చేతితో తయారు చేస్తారని చెప్పారు.


