News January 11, 2026

ములుగు జిల్లా రద్దు నిజమేనా..?

image

ఆరు ముక్కలుగా విభజించిన ఉమ్మడి వరంగల్ జిల్లాను మళ్లీ అతికించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మరోసారి జిల్లాల పునర్విభజన ప్రక్రియ ప్రచారం జోరందుకోవడంతో వరంగల్, హనుమకొండలను విలీనం చేయడంతో పాటుగా, భూపాలపల్లి జిల్లాలో ములుగును విలీనం చేయాలని చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎన్నో గొడవల నేపథ్యంలో ఏర్పాటైన ములుగు జిల్లాకు మంగళం పాడే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.

Similar News

News February 18, 2026

KNR: ‘మాదకద్రవ్యాల నిర్మూలన అందరి బాధ్యత’

image

మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం అధికారులు, యువత, తల్లిదండ్రులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘నార్కో కోఆర్డినేషన్’ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మత్తుమందులు విక్రయించే మెడికల్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ.. ఈ ఏడాది ఇప్పటివరకు 37 కేసులు నమోదు చేసి, 87 మందిని అరెస్ట్ చేశామన్నారు.

News February 18, 2026

‘నేను ఇండియాకు రాలేను’.. బాంబే హైకోర్టుకు తెలిపిన విజయ్ మాల్యా!

image

తాను భారత్‌కు తిరిగి రాలేనని పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడు విజయ్ మాల్యా బాంబే హైకోర్టుకు తెలిపారు. తన వద్ద యాక్టివ్ పాస్‌పోర్టు లేదని, పైగా బ్రిటన్ విడిచి వెళ్లకుండా అక్కడి కోర్టుల ఆంక్షలు ఉన్నాయని ఆయన తరఫు లాయర్ అమిత్ దేశాయ్ తెలిపారు. భారత్‌కు రానంత వరకు మాల్యా పిటిషన్లను విచారించబోమని చీఫ్ జస్టిస్ శ్రీ చంద్రశేఖర్ నేతృత్వంలోని ధర్మాసనం గతవారం స్పష్టం చేయడంతో ఆయన ఈ వివరణ ఇచ్చారు.

News February 18, 2026

చిత్తూరు జిల్లాపై గంజా మహ్మమారి పంజా.!

image

ఆధ్యాత్మిక నగరం తిరుపతి గంజాయి కోరల్లో చిక్కుకుంది. మదనపల్లె, రేణిగుంట, చిత్తూరు వంటి ప్రాంతాల్లో గంజాయి రవాణా యథేచ్ఛగా సాగుతోంది. బస్సులు, రైళ్ల ద్వారా గంజాయిని సరఫరా చేస్తున్నారు. పోలీసులు దాడులు చేస్తున్నా స్మగ్లర్లు ఎప్పటికప్పుడు రూటు మారుస్తున్నారు. జిల్లాలో కొందరు కీలక రాజకీయ నేతల అండదండలతో ఈ దందా సాగుతోందట. చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ మహ్మమారి ధాటికి యువత కోలుకోలేనంగా చిత్తవుతోంది.