News January 11, 2026

ఈ నెల 19 నుంచి 31 వరకు ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు

image

AP: ఈ నెల 19 నుంచి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహించనున్నారు. 13,257 గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి పశు వైద్య చికిత్సలు, నట్టల నివారణ మందుల పంపిణీ, వ్యాధి నిరోధక టీకాలను అందించడం, వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే పాడిరైతులకు పశు యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. పశుపోషకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరింది.

Similar News

News March 13, 2026

RTCలో సమ్మె: యాజమాన్యానికి JAC నోటీసు

image

TGRTC JAC.. యాజమాన్యానికి సమ్మె నోటీసు అందజేసింది. ప్రధానంగా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని, మహాలక్ష్మి పథకం కింద నెలకు ₹350 కోట్లు కోత లేకుండా నిధుల విడుదల చేయాలని డిమాండ్ చేసింది. అలాగే ₹2,500 కోట్ల పాత బకాయిల చెల్లింపు, ఉద్యోగ భద్రత, ట్రేడ్ యూనియన్లపై ఆంక్షల తొలగింపుతో పాటు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కోరింది.

News March 13, 2026

BREAKING: అకౌంట్లలో డబ్బులు జమ

image

AP: ఉగాది కానుకగా PM కిసాన్‌తోపాటు అన్నదాత సుఖీభవ నిధులను CM చంద్రబాబు విడుదల చేశారు. కృష్ణా(D) గన్నవరంలో 46.85 లక్షల మంది అన్నదాతల అకౌంట్లలో రూ.6 వేల చొప్పున జమ చేశారు. వీటిలో పీఎం కిసాన్ నిధులు రూ.2వేలు, అన్నదాత సుఖీభవ కింద రూ.4వేలున్నాయి. మీ అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయో లేదో ఇక్కడ <>క్లిక్<<>> చేసి, ఆధార్ నంబర్ ఎంటర్ చేసి తెలుసుకోండి.

News March 13, 2026

ఆల్కహాల్ తాగితే నిద్ర పడుతుందా?.. డాక్టర్లు ఏమన్నారంటే!

image

మద్యం తాగితే త్వరగా నిద్ర పడుతుందని చాలామంది భావిస్తారు. కానీ అది ఒక పెద్ద భ్రమ అంటున్నారు వైద్యులు. ‘ఆల్కహాల్ వల్ల గాఢ నిద్ర తగ్గి, రాత్రివేళ తరచూ మెలకువ వస్తుంది. దీంతో మెదడుకు విశ్రాంతి ఉండదు. గురక & స్లీప్ అప్నియా వంటి శ్వాసకోశ సమస్యలు కూడా పెరుగుతాయి. ఫలితంగా ఉదయం లేవగానే నీరసంగా, అలసటగా ఉంటుంది. కాబట్టి మంచి నిద్ర కోసం మద్యానికి దూరంగా ఉండటమే బెటర్’ అని సూచిస్తున్నారు. SHARE IT