News January 11, 2026

KNR: నేటితో ముగియనున్న ఉచిత శిక్షణ దరఖాస్తు

image

విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించేందుకు గాను ఐఈఎల్‌టీఎస్‌ ఇంగ్లిష్‌ ఉచిత శిక్షణ దరఖాస్తు ఆదివారంతో ముగుస్తుందని బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ రవికుమార్‌ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని ఈ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. https://studycircle.cgg.gov.in/ForwardingAction.do?status=bce వెబ్‌సైట్‌‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Similar News

News March 6, 2026

TODAY HEADLINES

image

* ఏ వివాదానికైనా సైనిక చర్య పరిష్కారం కాదు: PM
* BJP చేతికి బిహార్ పగ్గాలు.. RSకు నితీశ్
* WB గవర్నర్ బోస్, లద్దాక్ LG కవీందర్ రిజైన్
* ఇద్దరు, ఆపై సంతానానికి రూ.25,000: CBN
* జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వబోం: అయ్యన్న
* కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు: పవన్
* TG: రాజ్యసభకు సింఘ్వీ, నరేందర్ నామినేషన్
* TG: HYDలో రేవంత్ ఒక్క ఇల్లూ కట్టలేదు: KTR
* T20WC.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్

News March 6, 2026

తెలంగాణ కొత్త గవర్నర్ శుక్లా నేపథ్యం ఇదే

image

తెలంగాణ గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా నియమితులయ్యారు. ఈయన 1952లో గోరఖ్‌పూర్‌(UP)లో జన్మించారు. 1983లో BJPలో చేరారు. 1989, 91, 93, 96లో గోరఖ్‌పూర్ నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2016-2022 వరకు ఉత్తర్ ప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2017-19 వరకు నరేంద్ర మోదీ క్యాబినెట్‌లో ఆర్థికశాఖ సహాయమంత్రిగా పని చేశారు. 2023 నుంచి ఇప్పటివరకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్నారు.

News March 6, 2026

యుద్ధం ఎఫెక్ట్.. పడిపోయిన కోడి గుడ్ల ధర!

image

అమెరికా-ఇజ్రాయెల్vsఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ ప్రభావం మన దేశంలోని పౌల్ట్రీ రంగంపైనా పడింది. రోజుకు రూ.5 కోట్ల నష్టం వాటిల్లుతున్నట్లు అంచనా. మిడిల్ ఈస్ట్‌ దేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో కోడి గుడ్ల నిల్వలు పెరిగి ధరలు దారుణంగా పడిపోయాయి. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఒక్కో గుడ్డు ధరను రూ.4.30గా నిర్ణయించగా, స్థానిక మార్కెట్లలో రూ.3.50 పలుకుతోంది. రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉంది.