News January 11, 2026
వేములవాడ: TGLA క్యాలెండర్ ఆవిష్కరణ

తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ (TGLA) జిల్లా శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన 2026 క్యాలెండర్‌ను వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఆదివారం నాడు వేములవాడలోని తన క్యాంపు కార్యాలయంలో క్యాలెండర్ ఆవిష్కరించి లెక్చరర్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీఎల్ఏ జిల్లా శాఖ అధ్యక్షుడు ఆర్ లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి జే.సుమన్ సభ్యులు పాల్గొన్నారు.
Similar News
News March 12, 2026
తెనాలి: అమ్మో అడ్మిషన్లా.. ప్రైవేట్ టీచర్లకు తప్పని కష్టాలు

ప్రైవేట్ స్కూల్స్‌లో అడ్మిషన్ల కోసం టీచర్లకు టార్గెట్లు విధిస్తున్నారు. విద్యా సంవత్సరం పూర్తి కాకుండానే నూతన అడ్మిషన్లకు టీచర్లపై యాజమాన్యాలు ఒత్తిడి చేస్తుండటంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. టార్గెట్స్ పూర్తి చేయకపోతే జీతాలు నిలిపివేయడం, ఉద్యోగం నుంచి తొలగిస్తామని చెబుతుండటంతో టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక తప్పదన్నట్లు ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరుగుతూ అష్టకష్టాలు పడుతున్నారు.
News March 12, 2026
గ్యాస్ సిలిండర్ పేరుతో మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

కర్నూలు జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరతను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసే అవకాశాలున్నాయని ఎస్పీ విక్రాంత్ పాటిల్ బుధవారం హెచ్చరించారు. ప్రత్యేక ఆఫర్లు, వెంటనే బుకింగ్ చేయాలంటూ వచ్చే తప్పుడు సందేశాలను నమ్మవద్దన్నారు. గ్యాస్ బుకింగ్ కోసం అధికారిక యాప్‌లు, వెబ్‌సైట్లు ఉపయోగించాలని సూచించారు. తెలియని లింకులపై క్లిక్ చేయకుండా, ఓటీపీ లేదా బ్యాంక్ వివరాలు పంచుకోవద్దని పేర్కొన్నారు.
News March 12, 2026
అనంతపురం జిల్లాలో గ్యాస్ కొరత లేదు: జేసీ

అనంతపురం జిల్లాలో గ్యాస్ సిలిండర్ల సరఫరా సాధారణంగానే కొనసాగుతోందని, వినియోగదారులు ఆందోళన చెందవద్దని జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ తెలిపారు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా కొరత ఏర్పడుతుందనే ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. సింగిల్ సిలిండర్ వారు 21 రోజులు, డబుల్ సిలిండర్ వారు 30 రోజుల వ్యవధిలోనే బుకింగ్ చేసుకోవాలని సూచించారు. ఆసుపత్రులు, హాస్టళ్లకు సరఫరా నిరంతరాయంగా జరుగుతుందని వెల్లడించారు.


