News January 11, 2026
VKB: పండుగ.. మీ పిల్లలు పైలం!

సంక్రాంతి వచ్చిందంటే పిల్లల్లో ఆనందం పొంగిపొర్లుతుంది. పతంగులు ఎగురవేయడంలో పరస్పరం పోటీ పడుతూ సంబరాలు చేసుకుంటారు. తెగిపోయిన వాటికోసం పరుగులు పెడుతుంటారు. రోడ్లు, గుంతలు గమనించకుండా పతంగులను పట్టుకోవాలనే ఆత్రుతలో ప్రమాదాలకు ఎదురెళ్తారు. రేలింగ్ లేని బంగ్లాలపై కైట్‌లు ఎగురవేయడం వల్ల గతంలో అనేక ప్రమాదాలు జరిగాయి.
✦ పేరెంట్స్ పిల్లలపై నజరేయండి. సంక్రాంతిని సంతోషంగా జరుపుకోం
Similar News
News February 23, 2026
SKLM: ‘జాతీయ లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలి’

మార్చి 14న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికారి సంస్థ ఛైర్మన్ జూనైద్ అహమ్మద్ మౌలానా పేర్కొన్నారు. సోమవారం జిల్లా కోర్టులో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న అత్యధికంగా కేసులు రాజీ చేసేందుకు అధికారులు ప్రయత్నం చేయాలని సూచించారు. మోటర్ యాక్సిడెంట్ కేసుల్లో ఇన్సూరెన్స్ సంస్థలు త్వరితగతిన న్యాయం చేయాలన్నారు. ASP రమణ ఉన్నారు.
News February 23, 2026
మురికి కూపంలో జవహర్‌నగర్.. డంపింగ్ యార్డు వేట!

గ్రేటర్‌లో మున్సిపాలిటీల విలీనం చివరకు జవహర్‌నగర్ పాలిట శాపంగా మారింది. సిటీ నుంచి రోజూ దాదాపు 8000 మెట్రిక్ టన్నుల చెత్త అక్కడ చేరుతుండగా.. కొత్త ప్రాంతాల నుంచి వస్తున్న 1500 టన్నుల అదనపు భారం ఆ ఊరిని ఊపిరి పీల్చుకోనివ్వడం లేదు. ఈ నరకం నుంచి స్థానికులకు విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం వికేంద్రీకరణ బాట పట్టింది. శివారు ప్రాంతాల్లో కొత్త డంపింగ్ యార్డుల కోసం వేట మొదలుపెట్టింది.
News February 23, 2026
MBNR: పీఎం శ్రీ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

పీఎం శ్రీ పాఠశాలల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. సెంట్రల్ అబ్జర్వర్ ఫరీదా మహమ్మద్ బాలానగర్, రాజాపూర్ పాఠశాలలను తనిఖీ చేసి నిధుల వినియోగాన్ని పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమీక్షలో పనుల నాణ్యత, గడువుపై కలెక్టర్ అధికారులకు కీలక సూచనలు చేశారు.


