News January 11, 2026
HNK: రేపు ‘అనగనగా ఒక రాజు’ ప్రీ-రిలీజ్

నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ‘అనగనగా ఒక రాజు’ చిత్ర ప్రీ-రిలీజ్ వేడుకకు HNK వేదిక కానుంది. ఈ నెల 12న హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో భారీ వేడుకను నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. నగరంలో సినీ తారల సందడితో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.
Similar News
News March 8, 2026
T20 WC: ‘ఫైనల్’ పంచ్ ఎవరిది?.. జట్టులో మార్పులు ఉంటాయా?

T20 WC ఫైనల్‌లో నేడు భారత్, న్యూజిలాండ్ రా.7 గంటలకు అహ్మదాబాద్ స్టేడియంలో తలపడనున్నాయి. సొంత గడ్డపై WC గెలిచి చరిత్ర సృష్టించాలని ఇండియా, ఈసారైనా కప్ గెలవాలని కివీస్ పట్టుదలతో ఉన్నాయి. అభిషేక్, వరుణ్ స్థానాల్లో రింకూ సింగ్, కుల్దీప్‌ను తీసుకోవాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నా మార్పుల్లేకుండానే IND బరిలోకి దిగే అవకాశముంది. స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో లైవ్ చూడవచ్చు.
News March 8, 2026
మరో స్టార్ హీరోతో నయనతార నయా ప్రాజెక్ట్!

ఏజ్ పెరుగుతున్నా నయనతార క్రేజ్ తగ్గట్లేదు. లేడీ సూపర్ స్టార్ ట్యాగ్‌కి తగ్గట్లు స్టార్ హీరోల సినిమాల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు. షారుఖ్‌ఖాన్‌తో ‘జవాన్’, చిరంజీవితో ‘MSVPG’లో నటించి సూపర్ హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్‌కి జంటగా నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మూవీకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తారని సమాచారం. దీనిపై మేకర్స్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
News March 8, 2026
నిర్మల్: ‘ప్రజాపాలన’లో 341 ఫైళ్ల పరిష్కారం..!

రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్మల్ జిల్లాలో పారిశుద్ధ్య, ఫైళ్ల పరిష్కార డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతోంది. తాజా నివేదిక ప్రకారం.. జిల్లావ్యాప్తంగా ఏకంగా 48,673 కిలోల ఘన వ్యర్థాలను అధికారులు తొలగించారు. 1,044 ప్రభుత్వ కార్యాలయ భవనాలను శుభ్రం చేశారు. అంతేకాకుండా, పరిపాలనను వేగవంతం చేస్తూ పెండింగ్‌లో ఉన్న 341 ఫైళ్లను ఒకేరోజు పరిష్కరించారు.


